Kapil Sibal Modi : సామాజిక న్యాయం అబద్దం – సిబల్
మోదీపై కేంద్ర మాజీ మంత్రి ఆగ్రహం
Kapil Sibal Modi : సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడంపై తీవ్రంగా మండిపడ్డారు కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్. ఇప్పటికే దేశాన్ని భ్రష్టు పట్టించారని, ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఇంక ఏముందని సామాజిక న్యాయం చేస్తారంటూ ప్రశ్నించారు కపిల్ సిబల్(Kapil Sibal Modi) .
బీజేపీ సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కుతోందన్నారు. మతం ప్రాతిపదికగా ఏర్పడిన ఆ పార్టీ తన అసలు ముఖాన్ని బయటకు కనిపించకుండా చూస్తోందని ధ్వజమెత్తారు. ధనవంతులు మరింత ధనవంతులు అవుతారు. పేదలు ఇంకా పేదరికంలోనే మగ్గి పోతారు ఇదే బీజేపీ అద్భుత సిద్దాంతమంటూ ఎద్దేవా చేశారు. శుక్రవారం కపిల్ సిబల్ మీడియాతో మాట్లాడారు.
తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వ హయాంలో పెరుగుతున్న సంపద అంతరం, జీఎస్టీ వసూళ్లు, బిలియనీర్ గౌతమ్ అదానీ అనూహ్య సంపద , ప్రభుత్వ సంస్థల అప్పగింతను ఈ సందర్బంగా ప్రస్తావించారు కపిల్ సిబల్. సమాజాన్ని నిట్ట నిలువునా విద్వేషాల పేరుతో చీల్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. బీజేపీపై నిప్పులు చెరిగారు కపిల్ సిబల్(Kapil Sibal).
ప్రధానమంత్రి చెప్పినవేవీ ఇప్పటి దాకా అమలు చేయలేదన్నారు. ప్రతి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామన్నారు. ఒక్క పైసా కూడా రాలేదన్నారు. ఇక ఆర్థిక నేరస్తుల ఆట కట్టిస్తాననని చెప్పారని కానీ తానే వారికి అండగా ఉన్నారని ఆరోపించారు కపిల్ సిబల్.
Also Read : కరోనా వ్యాక్సిన్లు ఇవ్వండి – నితీశ్