PM Modi : డిజిటలైజేషన్ తో సామాజిక భద్రత – మోదీ
75 డీబీయూల ప్రారంభంపై వరల్డ్ బ్యాంకు కితాబు
PM Modi : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించారు. భారత దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేసింది. 11 ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ఇతర సంస్థలు కూడా వీటి ఏర్పాటులో కీలక భాగస్వామిగా ఉన్నాయి.
భారత దేశం 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించడంపై ప్రపంచ బ్యాంకు ప్రశంసలు కురిపించింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాన మంత్రి మోదీ వెళ్లడించారు. ఇది తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శమన్నారు. డిజిటలైజేషన్ ద్వారా సామాజిక భద్రతను నిర్ధారించడంలో భారత దేశం అగ్రగామిగా మారిందని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ(PM Modi).
ప్రధానంగా టెక్నాలజీ, ఫార్మా రంగంలో కీలక ముందడుగా ఆయన అభివర్ణించారు. ప్రధానంగా టెక్నాలజీకి సంబంధించి ప్రముఖులు, అనుభవం కలిగిన వారు, దిగ్గజ నిపుణులు సైతం భారత్ సాధించిన ఈ విజయాన్ని చూసి విస్తు పోయారని తెలిపారు ప్రధానమంత్రి. డిజిటల్ బ్యాంకు యూనిట్ల వ్యవస్థను ప్రత్యేకంగా అభినందించడం తనను మరింత పని చేసేలా చేస్తోందన్నారు.
దాని విజయాన్ని చూసి వారు ఆశ్చర్య పోవడం వింతేమీ కాదన్నారు. ఇవాళ డిబీయూల ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రజలకు వివిధ రకాల డిజిటల్ బ్యాంకు సౌకర్యాలను అందజేస్తాయని చెప్పారు మోదీ. ప్రజలు ఏడాది పొడవునా బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవలను తక్కువ ఖర్చుతో పొంద వచ్చని తెలిపారు.
Also Read : ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చీఫ్ గా సీమా
Hon’ble PM Shri Narendra Modi Ji dedicates 75 #DigitalBankingUnits across India. https://t.co/bUGtWPgD8a
— Nitin Gadkari (@nitin_gadkari) October 16, 2022