Somireddy Chandra Mohan Reddy : లోకేశ్ అరెస్ట్ కు కుట్ర
సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి
Somireddy Chandra Mohan Reddy : ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ పార్టీ చీఫ్ ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. ఇది పూర్తిగా తప్పు అని పేర్కొన్నారు. ఏపీ స్కిల్ స్కాం కేసులో ఎలాంటి అవినీతి, అక్రమాలు చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు.
Somireddy Chandra Mohan Reddy Comments Viral
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇదే సమయంలో తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ అరాచక పాలన సాగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
రాబోయే రోజుల్లో టీడీపీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమని జోష్యం చెప్పారు. జగన్ కు బుద్ది చెపుతారని పేర్కొన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(Somireddy Chandra Mohan Reddy). 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ఏనాడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదన్నారు.
14 ఏళ్ల పాటు సీఎంగా పని చేసిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. ఉమ్మడి ఏపీ ఇవాళ అభివృద్ది చెందడానికి కారకుడు ఆయనేనని పేర్కొన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
Also Read : AP CID : ఏపీ సీఐడీ ప్రశ్నల వర్షం