Somireddy : కాకాణి తిన్నదంతా కక్కిస్తాం
మాజీ మంత్రి సోమిరెడ్డి
Somireddy : అమరావతి – మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ మంత్రి కాకాణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేపల్లిలో కాకాణికి త్వరలోనే శుభం కార్డు పడనుందని అన్నారు. ఓడి పోవడం ఖాయమని, ఎక్కడ ఉన్నా వదిలి పెట్టే ప్రసక్తి లేద్నారు. దోపిడీ చేసిన ప్రతి రూపాయిని కక్కిస్తామని హెచ్చరించారు సోమిరెడ్డి.
Somireddy Slams Kakani
తాను సైదాపురంలో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నట్లు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్దమన్నారు. మంత్రిగా పవర్ ఫుల్ పోస్టులో కాకాణి ఎందుకు ఆపలేక పోయారంటూ ప్రశ్నించారు. వరదాపురంలో దోచుకున్నది చాలక ఇప్పుడు మరువూరులో మరో దుకాణం మొదలు పెట్టాడంటూ ధ్వజమెత్తారు.
తోటపల్లి గూడురు మండలం పేడూరులో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు సోమిరెడ్డి(Somireddy). ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తమ హయాంలో చేపట్టిన అభివృద్ది మాత్రమే కనిపిస్తోందని అన్నారు.
పేడూరు నుంచి చింతోపు లింక్ రోడ్డు అయినా, పేడూరు మీదుగా కాకుపల్లి రోడ్డు అయినా, ఇలా ఏ రోడ్డు అయినా తాము చేసినవేనని స్పష్టం చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మంత్రి కాకాణి చేసింది ఏమైనా ఉందంటే చెరువులను ధ్వంసం చేయడం, మట్టిని, తెల్ల రాయిని అమ్ముకోవడమని విమర్శించారు.
Also Read : BRS Focus : సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం