Somu Veerraju : 26 జిల్లాలకు బీజేపీ ఇన్ ఛార్జీలు
ప్రకటించిన స్టేట్ చీఫ్ సోమూ వీర్రాజు
Somu Veerraju : రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏపీలో భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ తన ప్రభుత్వాన్ని కోల్పోయింది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరింత బలోపేతం కావాలనే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు ఆ పార్టీ ఏపీ చీఫ్ సోమూ వీర్రాజు(Somu Veerraju).
తాజాగా రాష్ట్రంలోని 26 జిల్లాలకు పార్టీ ఇన్ ఛార్జీలను ప్రకటించారు. కీలక ప్రకటన చేశారు. ఇక జిల్లాల వారీగా చూస్తే పార్వతీపురం జిల్లాకు ప్రకాశ్ రెడ్డిని నియమించారు. అరకు జిల్లాకు పరశురామరాజు, శ్రీకాకుళంకు విజయానంద రెడ్డి, విశాఖపట్నంకు పుట్ట గంగయ్య, అనకాపల్లికి కోడూరు లక్ష్మి నారాయణ, అమలాపురం కు రామ్మోన్ ను ఎంపిక చేశారు. ఇక రాజమండ్రికి కృష్ణ భగవాన్ , నరసాపురంకు డాక్టర్ ఉమా మహేశ్వర్ రాజు, ఏలూరు జిల్లాకు రేలంగి శ్రీదేవి, మచిలీపట్నంకు కపర్థి, విజయవాడకు నర్సింగరావును నియమించారు బీజేపీ స్టేట్ చీఫ్ సోమూ వీర్రాజు(Somu Veerraju).
గుంటూరు జిల్లాకు నీలకంఠ, నరసారావుపేటకు గాజుల వెంకయ్య నాయుడు, బాపట్లకు అడ్డూరి శ్రీరామ్ , ప్రకాశం జిల్లాకు సురేంద్ రెడ్డి, నెల్లూరు జిల్లాకు కోలా ఆనంద్ , తిరుపతి జిల్లాకు కందుకూరి సత్యనారాయణ, రాజంపేట కు చంద్రమౌళి, చిత్తూరుకు రఘురామి రెడ్డి, కడప జిల్లాకు వెంకటేశ్వర్ రెడ్డి,
హిందూపూర్ జిల్లాకు నాగోతు రమేశ్ నాయుడు, అనంతపూర్ కు శ్రీనాథ్ రెడ్డి, కర్నూల్ జిల్లాకు అంకాల్ రెడ్డి, నంద్యాల జిల్లాకు పోతుకుంట రమేశ్ నాయుడును ఎంపిక చేశారు సోమూ వీర్రాజు.
Also Read : RCB vs GT IPL 2023