Somu Veerraju : బెలూన్ల కలకలంపై హోం శాఖకు ఫిర్యాదు
స్పష్టం చేసిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు
Somu Veerraju : అల్లూరి సీతారామ రాజు జయంతి వేడుకల సందర్భంగా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు బెలూన్లు ఎగుర వేశారు.
దీనిపై పెద్ద రాద్దాంతం చోటు చేసుకుంది. వారిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోం శాఖ కూడా వివరణ కోరింది. ఏ మాత్రం హెలిక్యాప్టర్ కు తాకి ఉంటే పెద్ద ప్రమాదమే చోటు చేసుకుని ఉండేది.
పైలట్ చాక చక్యంగా వ్యవహరించడంతో సురక్షితంగా రాగలిగారు. ప్రధాన మంత్రి తన పర్యటన ముగించుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాల్సింగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.
ప్రధానమంత్రి వస్తున్నారంటే పెద్ద ఎత్తున భద్రత ఉంటుంది. వారం రోజుల ముందుగానే ఎస్పీజీ ప్రొటెక్షన్ ఫోర్స్ తన పరిధిలోకి మొత్తం పరిసరాలను స్వాధీనం చేసుకుంటుంది.
మరి పీఎం పర్యటన ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు బెలూన్లను ఎలా ఎగుర వేయగలిగారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంత జరుగుతున్నా ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారంటూ బీజేపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
తాజాగా బెలూన్ల ఎగుర వేసిన ఘటనపై ఏపీ భారతీయ జనతా పార్టీ చీఫ్ సోము వీర్రాజు(Somu Veerraju) స్పందించారు. విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర హోం శాఖ మంత్రికి తాను ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
ఘటన వెనుక సూత్రధారులు, పాత్రధారులు, కుట్ర అమలు చేసిన దుష్ట శక్తులను గుర్తించి శిక్షించాలని కోరారు.
Also Read : మోదీజీ ప్రత్యేక హోదా ఇవ్వండి ప్లీజ్