Sunil kanugolu PK : పీకేకు మంగళం సునీల్ కు అందలం
కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ లో చోటు
Sunil kanugolu PK : నిన్నటి దాకా ప్రశాంత్ కిషోర్ ను చేర్చుకోవాలని అనుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆయన అందుకు ఒప్పుకోలేదు. స్వతంత్రంగా ఉండేందుకే ఇష్టపడ్డారు. చివరి దాకా చేసిన చర్చలు ఫలించ లేదు.
దీంతో వచ్చే అక్టోబర్ 2 నుంచి గాంధీ జయంతి నాడు 3 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు. బీహార్ పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అంతే కాదు తెలంగాణలో టీఆర్ఎస్ తో ఒప్పందం చేసుకున్నారు.
ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నంతగా పోటీ నెలకొంది. దీంతో ప్రశాంత్ కిషోర్ దగ్గర పని చేసిన సునీల్ కానుగోలు(Sunil kanugolu) కు ఇప్పుడు కీలక పదవిని కట్టబెట్టడం రాజకీయ వర్గాలలో కలకలం రేపింది.
ఇటీవల గుజరాత్ లోని ఉదయ్ పూర్ లో మూడు రోజుల పాటు చింతన్ శివిర్ చేపట్టింది పార్టీ. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అందులో భాగంగానే పార్టీని బతికించు కోవాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందన్నారు ఆ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ. దీన్ని బట్టి చూస్తే పార్టీ పరిస్థితి మరింత దిగజారిందని అనుకోక తప్పదు.
ఈ తరుణంలో మంగళవారం ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ చీఫ్ రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. మీడియా, ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అంతా సునీల్ కానుగోలుకు(Sunil kanugolu) తెర తీశారు.
ప్రస్తుతం సునీల్ టీంలో ఉన్న పీకేకు(Sunil kanugolu PK) ఒక రకంగా ఇబ్బంది పెట్టే వార్త ఇది. సునీల్ ఇప్పటికే పని కూడా ప్రారంభించాడు. బెంగళూరు వేదికగా ఆఫీస్ ను స్టార్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి పని చేయడం ప్రారంభించారు.
ప్రస్తుతం ఏకంగా టాస్క్ ఫోర్స్ టీమ్ లో చోటు దక్కడం పార్టీ వర్గాలను సైతం విస్మయానికి గురి చేసింది.
Also Read : క్వాడ్ ప్రపంచానికి ఓ దిక్సూచి – మోదీ