Sonia Gandhi : కేంద్రం వైఫల్యాలపై నిలదీయాలి – సోనియా
బడ్జెట్ సమావేశాలపై దిశా నిర్దేశం
Sonia Gandhi Protest Centre : పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ సీరియస్ కామెంట్స్ చేశారు. పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఆమె సోమవారం దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీతో(Sonia Gandhi Protest Centre) పాటు కీలక నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
ఇదే క్రమంలో మిగతా పార్టీలకు చెందిన ఎంపీలను కూడా కలుపుకుని పోవాలని సూచించారు. ఎక్కడా రాజీ పడకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎలా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయనే దానిపై ఫోకస్ పెట్టాలన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలకు తెలియ చేసేలా ఎంపీలు నిలదీయాలని పిలుపునిచ్చారు సోనియా గాంధీ.
వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గుణపాఠం చెప్పే రోజు తప్పకుండా వస్తుందని అన్నారు సోనియా గాంధీ(Sonia Gandhi). అంతకు ముందు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో విపక్ష పార్టీలు సమావేశం అయ్యాయి.
పార్లమెంట్ కాంప్లెక్స్ నుంచి విజయ్ చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ పార్టీతో పాటు డీఎంకే, జేడీయూ , ఆప్ , సీపీఎం, కేసీ, ఆర్ల్డీ, సీపీఐ , ఐయుఎంఎల్ , శివసేన ఉద్దవ్ టాక్రే , ఎండీఎంకే, ఆర్ఎస్పీ, ఆర్జేడీ, జేఎంఎం, బీఆర్ఎస్ కు చెందిన ఎంపీలు పాల్గొన్నారు.
మోదీ అదానీ మధ్య ఉన్న లింకు ఏమిటో చెప్పాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదే సమయంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్ల కార్డులు ప్రదర్శించారు.
Also Read : అదానీ..మోదీ ‘లూటో లూటో’ వైరల్