Sonia Gandhi : రుణం తీర్చుకోండి పార్టీని గెలిపించండి
పిలుపునిచ్చిన ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ
Sonia Gandhi : పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పార్టీ అంటే ఒక్కరు లేదా ఇద్దరు కాదు. కార్యకర్తలు, నాయకులు, బాధ్యులు కూడా. మీరంతా కలిస్తేనే పార్టీ బలపడుతుంది. మనుగడ సాగిస్తుంది.
దేశంలో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, చరిత్ర కలిగిన ఏకైక పార్టీ మనది. మనల్ని మనం పరిశీలించు కోవాల్సిన సమయం ఆసన్నమైంది.
ఇంత కంటే ఎక్కువగా నేను చెప్పలేను. పార్టీ పరంగా మీ రుణం తీర్చుకోండి. పార్టీని గెలిపించండి అంటూ పిలుపునిచ్చారు ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi). దేశం సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది.
ఓ వైపు ద్రవ్యోల్బణం ఇంకో వైపు నిరుద్యోగం, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం , పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరా భారం, నిత్యావసరాల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోంది. ఈ తరుణంలో పార్టీ పరంగా ప్రజల కోసం పని చేయాలని పిలుపునిచ్చారు సోనియా గాంధీ. గుజరాత్ వేదికగా చింతన్ శిబిర్ మూడు రోజుల పాటు జరగనుంది.
2024 ఎన్నికలే మన టార్గెట్ కావాలి. ఆక్టోపస్ లా అల్లుకు పోయి దేశానికి గుదిబండగా మారిన బీజేపీకి బుద్ది చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందన్నారు సోనియా గాంధీ(Sonia Gandhi).
ఈ కీలక దశలో అడుగులు ముందుకు వేయడం తప్ప మరో మార్గం లేదు. మన దగ్గర మంత్రదండాలు లేవు. కేవలం కలిసికట్టుగా కృషి చేయడమే కావాల్సింది అని స్పష్టం చేశారు.
పార్టీనే అంతిమం అదే కీలకం. విమర్శలకు మంగళం పాడండి పార్టీ కోసం పాటు పడండి అని కోరారు సోనియా గాంధీ.
Also Read : దైవం పేరుతో కాషాయం రాజకీయం