Sonia Gandhi Azad : సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. గతంలో ఎన్నడూ లేనీ రీతిలో సోనియా గాంధీ ఫ్యామిలీపై అసమ్మతి నాయకులు మరింత స్వరాన్ని పెంచారు.
ఢిల్లీలో సీడబ్ల్యూసీ మీటింగ్ ముగిశాక అసమ్మతికి ఆజ్యం పోసి నాయకత్వం వహిస్తున్న గులాం నబీ ఆజాద్ నివాసంలో రెండు సార్లు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికే జీ-23 పేరు పెట్టారు. పార్టీ నాయకత్వం అన్ని పార్టీలతో కలుపుకుని పోవాలని, లేక పోతే పార్టీ మనుగడ కష్టమని ఇప్పటికే హెచ్చరించారు ఆజాద్. దేశ వ్యాప్తంగా తమ వాయిస్ వినిపించాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం.
ఈ తరుణంలో ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ గా ఉన్న సోనియా గాంధీ(Sonia Gandhi Azad) ఒత్తిడి మేరకు గులాం నబీ ఆజాద్ తో ఫోన్ లో మాట్లాడారని, ఇవాళ ఆజాద్ తో భేటీ కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ సందర్భంగా కొన్ని డిమాండ్స్ ముందు ఉంచనున్నారు. గత ఆదివారం జరిగిన పార్టీ అత్యున్నత సమావేశంలో తిరిగి సోనియా గాంధీనే తిరిగి చీఫ్ గా ఎన్నుకోవడాన్ని అసంతృప్త నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
వారిలో ఆజాద్ తో పాదు కపిల్ సిబల్, బూపీందర్ హూడా, మనీశ్ తివారీ , శశి థరూర్ ఉన్నారు. వీరికి మరికొందరు నేతలు తోడయ్యారు. తమ డిమాండ్లు పట్టించుకోక పోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుందని స్పష్టం చేశారు.
ఇప్పటికే తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పట్టు కోల్పోయింది. పవర్ లో ఉన్న పంజాబ్ ను పోగొట్టుకుంది. దీంతో అసమ్మతి స్వరం మరింత పెరిగింది.
Also Read : సువేందు నిర్వాకం ఎమ్మెల్యేలు ఆగ్రహం