Sonia Gandhi : కాంగ్రెస్ (Congress) పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం మంగళవారం జరగనుంది. పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi )అధ్యక్షతన ఈ మీటింగ్ కొనసాగుతుంది. ఈ సమావేశానికి రాజ్యసభ, లోక్ సభకు చెందిన పార్టీ ఎంపీలు హాజరవుతారు.
ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఉత్తర ప్రదేశ్ , ఉత్తరాఖండ్, మణిపూర్ , గోవా, పంజాబ్ రాష్ట్రాలలో ఆశించిన ఫలితాలు రాలేదు.
ఇక అధికారంలో ఉన్న పంజాబ్ (Punjab) ను కోల్పోయింది. దీంతో సీనియర్లు అసమ్మతి స్వరాన్ని పెంచారు. జీ-23 సమావేశం పేరుతో పలుమార్లు సమావేశం అయ్యారు. గాంధీ ఫ్యామిలీ నాయకత్వాన్ని ప్రశ్నించారు.
దీంతో ఓ వర్గం అనుకూలంగా మరో వర్గం వ్యతిరేకంగా తయారైంది. దీంతో జీ23కి నాయకత్వం వహిస్తున్న వారితో సంప్రదింపులు జరిపింది మేడం సోనియా గాంధీ (Sonia Gandhi) .
ఇదిలా ఉండగా తాజాగా ఈ ఏడాది చివర్లో గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా సరే పట్టు నిలుపు కోవాలని సోనియా ఆశిస్తున్నారు.
అంతే కాదు కర్ణాటకలో కూడా వచ్చిన ఛాన్స్ ను ఎగరేసుకు పోయింది బీజేపీ (BJP) . ఈ తరుణంలో జరిగే కీలక మీటింగ్ లో పలు అంశాలు చర్చకు రానున్నాయి
కాగా పలు రాష్ట్రాలలో కొందరు నేతలకు పడడం లేదు. పార్టీకి సంబంధించి బయటి పార్టీలతో కంటే అంతర్గతంగానే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటోంది సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ (Congress) పార్టీ. ఇక ఇందులో భాగంగానే జీ23 నేతనలు కలవనున్నట్లు సమాచారం.
Also Read : పెరిగిన పెట్రో భారం ఇక మోయలేం.