Sonia Gandhi : మ‌ణిపూర్ అల్ల‌ర్ల‌పై సోనియా ఆరా

హాజ‌రైన రాష్ట్ర పీసీసీ చీఫ్

Sonia Gandhi : మ‌ణిపూర్ లో చోటు చేసుకున్న హింస‌, అల్ల‌ర్ల‌పై సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ సోమ‌వారం ఢిల్లీలో ప్ర‌త్యేకంగా ఆరా తీశారు. కాంగ్రెస్(Congress) పార్టీ ఆధ్వ‌ర్యంలో కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈ మీటింగ్ కు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే , మాజీ చీఫ్ రాహుల్ గాంధీ , ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ తో పాటు మ‌ణిపూర్ రాష్ట్ర పీసీసీ చీఫ్ మేఘ చంద్ర, సీఎల్పీ నేత , మాజీ సీఎం ఓక్ర‌మ్ ఇబోబి సింగ్ హాజ‌ర‌య్యారు.

Sonia Gandhi Asking to Respond Modi

రాష్ట్రంలో హింస‌, అల్ల‌ర్ల‌కు ప్ర‌ధాన కార‌ణం ప్ర‌భుత్వ‌మేన‌ని ఆరోపించారు పీసీసీ చీఫ్ ,మాజీ సీఎం. ఈ మేర‌కు అక్క‌డ ప్ర‌స్తుతం ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని సోనియా గాంధీకి వివ‌రించారు. హింస‌కు పూర్తి బాధ్య‌త వ‌హించాల్సింది ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీనేన‌ని స్ప‌ష్టం చేశారు. మ‌ణిపూర్ లో హింస‌, అల్ల‌ర్లు పూర్త‌యి 3 నెల‌లు అవుతోంద‌ని పేర్కొన్నారు. ఈ హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల్లో 160 మంది ప్రాణాలు కోల్పోయార‌ని , కానీ న‌రేంద్ర మోదీ స్పందించిన దాఖ‌లాలు లేవ‌న్నారు.

300 మందికి పైగా గాయ‌ప‌డ్డార‌ని, 50 వేల మందికి పైగా నిరాశ్ర‌యుల‌య్యార‌ని, 10 వేల మందికి పైగా ఆర్మీ , సైనిక బ‌ల‌గాలు మోహ‌రించినా నేటికీ కంట్రోల్ కాలేద‌ని వాపోయారు. మ‌రోసారి మ‌ణిపూర్ అంశం గురించి పార్ల‌మెంట్ లో ప్ర‌స్తావించాల‌ని కోరారు.

Also Read : Manipur Violence : మ‌ణిపూర్ హింస‌కు మోదీదే బాధ్య‌త

Leave A Reply

Your Email Id will not be published!