Sonia Gandhi : కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన పార్టీకి చెందిన ఎంపీల సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.
పార్టీ పరంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పార్టీకి కావాల్సింది సమన్వయం ముఖ్యమని స్పష్టం చేశారు.
పార్టీని ఎలా బతికించాలి, ఎలా బలోపేతం చేయాలనే దానికి సంబంధించి అన్ని వర్గాల నుంచి పలు సూచనలు, అభిప్రాయాలు వచ్చాయని చెప్పారు సోనియా గాంధీ.
ఆమె పార్టీలో అసమ్మతి స్వరం వినిపిస్తున్న నాయకులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఇటీవల దేశంలోని ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేపట్టక పోవడాన్ని కూడా ప్రస్తావించారు .
పార్టీని మరింత బలోపేతం చేయడంలో ఎక్కువగా ఫోకస్ పెట్టానని పేర్కొన్నారు సోనియా గాంధీSonia Gandhi). ఎవరైనా సరే ముందు ఆత్మ పరిశీలన చేసు కోవాలని సూచించారు.
ఎన్నికల ఫలితాలపై మీరు బాధ పడుతున్నారని తనకు తెలుసన్నారు. అంకిత భావం, దృఢ సంకల్పం, స్పూర్తి తీవ్ర పరీక్షకు గురవుతున్నారని తెలిపారు.
దేశ వ్యాప్తంగా సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ మనది అని, అన్ని స్థాయిలలో ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు సోనియా గాంధీ(Sonia Gandhi).
మొత్తంగా పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది. మన ముందు రాబోయే ఎన్నికలు ఉన్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు సిద్దమై ఉండాలని పిలుపునిచ్చారు.
Also Read : తెలంగాణ కాంగ్రెస్ కు బాస్ చికిత్స