Sonia Gandhi : బ‌రువు దిగింది ఉప‌శ‌మ‌నం ల‌భించింది

కొత్త‌గా ఎన్నికైన మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు బాధ్య‌త‌ల అప్ప‌గింత‌

Sonia Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ ప‌రంగా కొన్నేళ్లు బాధ్య‌త‌లు మోశాన‌ని ఇక బ‌రువు దిగి పోయింద‌ని, ఇక నుంచి ప్ర‌శాంతంగా ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఎన్నో స‌వాళ్లు ఎదుర్కొన్నా. అన్నిటికంటే ఎక్కువ ఆటుపోట్లు కూడా ఎదుర‌య్యాయ‌ని తెలిపారు.

పార్టీని మోయ‌డం అంటే మామూలు విష‌యం కాద‌న్నారు. ఎన్నో విమ‌ర్శ‌లు మరెన్నో ఆరోప‌ణ‌లు వాటన్నింటిని త‌ట్టుకుని నిల‌బ‌డ్డాన‌ని ఇది ఒక ర‌కంగా తన కుటుంబం నుంచి నేర్చుకున్నందు వ‌ల్ల వ‌చ్చింద‌ని చెప్పారు సోనియా గాంధీ. కాంగ్రెస్ పార్టీ నూత‌న అధ్య‌క్షుడిగా 24 ఏళ్ల త‌ర్వాత గాంధీయేత‌ర వ్య‌క్తి క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

ఆయ‌న త‌న స‌మీప ఎంపీ శ‌శి థ‌రూర్ పై భారీ తేడాతో విజ‌యాన్ని సాధించారు. ఒక ర‌కంగా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే గాంధీ ఫ్యామిలీకి విధేయుడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆయ‌న దీనిని కాదంటూనే అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవ‌డంలో త‌ప్పు లేద‌ని స్ప‌ష్టం చేశారు.

గ‌తంలో పార్టీ ఎన్నో సంక్షోభాల‌ను ఎదుర్కొంద‌ని, కానీ ఏనాడూ తాను ఓట‌మిని ఒప్పు కోలేద‌న్నారు ఈ సంద‌ర్భంగా సోనియా గాంధీ. ప‌ద‌వుల కోసం పాకులాడిన దాఖ‌లాలు లేవ‌ని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేద‌న్నారు. అపార‌మైన అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు పేరుంద‌ని ప్ర‌శంసించారు.

పోటీ అన్న‌ది ప్ర‌తి చోటా ఉంటుంద‌ని దానిని ప్ర‌తికూలంగా తీసుకోకూడ‌ద‌ని పేర్కొన్నారు సోనియా గాంధీ.

Also Read : కూలీ కొడుకును కాంగ్రెస్ చీఫ్ అయ్యాను

Leave A Reply

Your Email Id will not be published!