Nirmala Sitharaman : సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలి – నిర్మలా
ఎంపీ అధీర్ రంజన్ చౌదరి కామెంట్స్ పై ఫైర్
Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన కామెంట్స్ చేశారు. ఆ పార్టీకి చెందిన ఎంపీ అధీర్ రంజన్ చౌదరి భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఇది కావాలని చేసిన వ్యాఖ్యలుగా ఆమె అభివర్ణించారు. గురువారం పార్లమెంట్ లో ఎంపీ కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలిపారు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు. ఎంపీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ,
స్మృతీ ఇరానీ. ఎంపీ చేసిన వ్యాఖ్యలకు పూర్తి బాధ్యత వహించాలని ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీని డిమాండ్ చేశారు నిర్మలా సీతారామన్. ఒక బాధ్యత కలిగిన ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.
మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఒక మహిళ పార్టీకి చీఫ్ గా ఉన్న సమయంలో ఇలాంటి కామెంట్స్ వాడడం దారుణమన్నారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ అధీర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి రాష్ట్రపత్ని అని కామెంట్ చేశారు. ఇది తీవ్ర దుమారం రేగింది.
ఇది ఉద్దేశ పూర్వకంగా జరిగిన సెక్సిస్ట్ అవమానం అంటూ పేర్కొన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎంపీ చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ బేషరత్తుగా సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : ఎంపీ అధీర్ రంజన్ చౌదరి క్షమాపణ చెప్పాలి
It was a deliberate sexist insult. Sonia Gandhi should apologise to the President of India and the country: Finance Minister & BJP leader Nirmala Sitharaman on Cong MP Adhir Chowdhury's 'Rashtrapatni' remark pic.twitter.com/4CSGFzH2TE
— ANI (@ANI) July 28, 2022