Sonia Gandhi : నెహ్రూను విస్మ‌రించ‌డం దారుణం

బీజేపీ స‌ర్కార్ పై సోనియా గాంధీ

Sonia Gandhi : కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ ప్ర‌భుత్వం రోజు రోజుకు ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవలంభిస్తోందంటూ ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ. దేశానికి స్వాతంత్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌య్యాయి.

ఇవాళ పంధ్రాగ‌ష్టు సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇదే స‌మ‌యంలో మోదీ అనుస‌రిస్తున్న ఫాసిస్టు ధోర‌ణిని తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు.

రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం భార‌త దేశానికి చెందిన గొప్ప స్వాతంత్ర స‌మ‌ర యోధుల స‌హ‌కారాన్ని, వారి పాత్ర‌ను త‌గ్గించే ప్ర‌యత్నం మంచి ప‌ద్ది కాద‌ని మండిప‌డ్డారు.

క‌ర్ణాట‌క‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌న హ‌ర్ ఘ‌ర్ తిరంగా లో భాగంగా దేశ మొద‌టి ప్ర‌ధాన మంత్రి జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ ను తొల‌గించ‌డంపై నిప్పులు చెరిగారు సోనియా గాంధీ. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది.

మిత్రులారా గ‌త 75 ఏళ్ల‌లో మ‌నం చాలా సాధించాం. కానీ నేటి మోదీ రాచ‌రిక ప్ర‌భుత్వం మ‌న స్వాతంత్ర స‌మ‌ర యోధుల త్యాగాలు, బ‌లిదానాల‌ను , దేశం సాధించిన విజ‌యాల‌ను ఎప్ప‌టికీ అంగీక‌రించ లేని విధంగా త‌క్కువ చేయ‌డంలో బిజీగా ఉంద‌న్నారు.

ఈ సంద‌ర్బంగా సోనియా గాంధీ(Sonia Gandhi)  ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆమెకు మ‌రోసారి క‌రోనా సోకింది. దీంతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.

రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం చారిత్ర‌క వాస్త‌వాల‌ను త‌ప్పుగా చిత్రీక‌రించ‌డాన్ని కాంగ్రెస్ అంగీక‌రించ‌ద‌న్నారు. అబద్దాల ఆధారంగా గాంధీ, నెహ్రూ, ప‌టేల్ , ఆజాద్ ల‌ను అవ‌మానించ‌డాన్ని అనుమ‌తించ బోమ‌ని స్ప‌ష్టం చేశారు.

రాబోయే రోజుల్లో బీజేపీకి పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌న్నారు.

Also Read : స్వ‌తంత్ర భార‌త‌మా జ‌య‌హో

Leave A Reply

Your Email Id will not be published!