Sonia Gandhi : మోదీ ప్రభుత్వం దేశానికి ప్రమాదం
సోనియా గాంధీ సంచలన కామెంట్స్
Sonia Gandhi : ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో శుక్రవారం నవ సంకల్ప్ చింతన్ శివిర్ ప్రారంభమైంది. ఈ బైటక్ మూడు రోజుల పాటు జరుగుతుంది.
తాజాగా ఆమె సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం దేశానికి ప్రమాదకరంగా తయారైందని ఆరోపించారు.
కులం పేరుతో, మతం పేరుతో , వర్గాలు, ప్రాంతాల పేరుతో దేశాన్ని నిట్ట నిలువునా విభిజిస్తూ పబ్బం గడుపుకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ మేధో మథన సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు 400 మందికి పైగా పార్టీ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ(Sonia Gandhi) మోదీని టార్గెట్ చేశారు.
మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ దాడులకు పాల్పడుతోందంటూ ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను గంప గుత్తగా అమ్మకానికి పెట్టిన సర్కార్ ప్రజా సమస్యలను గాలికి వదిలి వేసిందంటూ మండిపడ్డారు సోనియా గాంధీ(Sonia Gandhi) .
రాజకీయంగా బెదిరింపులకు గురి చేయడం, కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిందన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన మంత్రి పాలనా పరంగా వైఫల్యం చెందారని సీరియస్ అయ్యారు.
ఈ దేశంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఓట్లు వేసి అధికారాన్ని ఇచ్చింది దాడులు చేయమని, ద్వేషించమని కాదన్నారు.
దేవుళ్ల పేరుతో రాజకీయం చేయడం మోదీ త్రయానికి అలవాటుగా మారిందని ఫైర్ అయ్యారు. బీజేపీయేతర వ్యక్తులు, సంస్థలను టార్గెట్ చేయడం, దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం అలవాటుగా మారిందన్నారు.
Also Read : డీకే నిర్వాకం దివ్య స్పందన ఆగ్రహం