Sonia Gandhi : సోనియా గాంధీకి మరోసారి కరోనా
పరీక్షల్లో పాజిటివ్ గా తేలిందన్న పార్టీ
Sonia Gandhi : మహమ్మారి కరోనా ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీని(Sonia Gandhi) వీడడం లేదు. ఆమెకు ఇప్పటి వరకు రెండు సార్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా చికిత్స తీసుకున్న అనంతరం ఇంటికి వచ్చారు.
తాజాగా మరోసారి పరీక్షలు చేపట్టగా సోనియా గాంధీకి పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది కాంగ్రెస్ పార్టీ. చివరిగా ఇన్ఫెక్షన్ వచ్చిన రెడు నెలల తర్వాత సోనియా గాంధీ జూన్ లో కూడా కరోనా వైరస్ కోసం పాజిటివ్ పరీక్షించారు.
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావడానికి కరోనా సోకడంతో ఈడీకి కొంత సమయం కావాలని కోరారు.
ఈ మేరకు ఈడీ కూడా ఓకే చెప్పింది. ఢిల్లీలో ఆస్పత్రిలో చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యింది. ఈడీ ముందు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఆరు గంటల చొప్పున ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది.
ఆపై ఈడీ నేషనల్ హెరాల్డ్ ఆఫీసుకు తాళం వేసింది. శనివారం మరోసారి అనుమానం రావడంతో సోనియా గాంధీకి పరీక్షలు నిర్వహించారు.
దీంతో ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. పార్టీకి చెందిన ఎంపీ , మీడియా ఇన్ చార్జ్ జై రామ్ రమేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, ప్రోటోకాల్ ను అనుసరించి ఒంటరిగా ఉంటారని తెలిపారు. సోనియా గాంధీకి మరోసారి కరోనా సోకింది. ఆమె త్వరగా కోలుకోవాలని పార్టీ కోరుకుంటోందని పేర్కొన్నారు.
Also Read : ఎంపీలున్నా పదవులు ఇవ్వలేదు – సీఎం