Sonia Gandhi Tribute : రాజీవ్..నీ జ్ఞాపకం పదిలం – సోనియా
79వ జయంతి సందర్భంగా నివాళి
Sonia Gandhi Tribute : తన భర్త రాజీవ్ గాంధీకి ఢిల్లీలో ఆదివారం ఘనంగా నివాళులు అర్పించారు సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ. 79వ జయంతి. తనయుడు రాహుల్ గాంధీ లడఖ్ లో తన తండ్రి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ తల్లి దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ. ఆమె సిక్కు బాడీ గార్డుల కాల్పుల్లో మృతి చెందారు. ఇక రాజీవ్ మరణం బాధాకరం. తమిళనాడులో దారుణ హత్యకు గురయ్యారు. ఆయనను ఎల్టీటీఈ పొట్టన పెట్టుకుంది.
Sonia Gandhi Tribute to Rajiv Gandhi
ఇవాళ ఆయన జయంతి కావడంతో పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నారు. రాజీవ్ గాంధీ తన తాత నెహ్రూ, తల్లి ఇందిరా గాంధీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. ఈ దేశానికి టెక్నాలజీ , టెలికాం అవసరమని గుర్తించారు. టెలికాం విప్లవానికి ఆద్యుడు ఆయనే. ఆనాడే టెక్నాలజీ ప్రాధాన్యతను ఎరిగిన మహా నాయకుడు.
1984 నుంచి 1989 వరకు భారత దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మే 21, 1991న రాజీవ్ గాంధీని ఈ దేశం కోల్పోయింది. ఆయన అందించిన వారసత్వాన్ని తనయుడు రాహుల్ గాంధీ అందిపుచ్చుకున్నారు. ఇటీవలే భారత్ జోడో యాత్రను చేపట్టారు. జనం కోసం తాను ఉన్నానంటూ స్పష్టం చేశారు. ఈ సందర్బంగా సోనియా గాంధీ(Sonia Gandhi) నివాళులు అర్పిస్తూ ..రాజీవ్ నీ జ్ఞాపకం ఎల్లప్పటికీ నిలిచే ఉంటుందని పేర్కొన్నారు.
Also Read : Rahul Gandhi Viral : లడఖ్ లో రాహుల్ డ్యాన్స్ అదుర్స్