Sonia Gandhi : ఈడీ ముందుకు మ‌రోసారి సోనియా

త‌ల్లితో పాటు రాహుల్, ప్రియాంక

Sonia Gandhi : నేష‌న‌ల్ హెరాల్డ్ వార్తా ప‌త్రిక‌కు సంబంధించిన మ‌నీ లాండ‌రింగ్ కేసులో విచార‌ణ నిమిత్తం కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ మ‌రోసారి మంగ‌ళ‌వారం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ ) ముందు హాజ‌ర‌య్యారు.

ఆమె వెంట కుమారుడు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఈడీ స‌మ‌న్లు ఇవ్వ‌డాన్ని, విచార‌ణ‌కు పిలిపించ‌డాన్ని నిర‌సిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో శాంతియుతంగా నిర‌స‌న తెలియ చేస్తోంది.

వంద‌ల కోట్లు చేతులు మారాయంటూ ఆరోప‌ణ‌లు చేశారు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన మాజీ ఎంపీ, ప్ర‌ముఖ న్యాయ‌వాది సుబ్ర‌మ‌ణ్య స్వామి. దీంతో కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో ఈ కేసు కొట్టి వేశారు.

కానీ బీజేపీ స‌ర్కార్ హ‌యాంలో దీనిని తిరిగి తెరిచారు. ఇదంతా కుట్ర పూరిత‌మైన క‌క్ష సాధింపేన‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇందులో భాగంగా నేష‌న‌ల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియా గాంధీకి(Sonia Gandhi), రాహుల్ గాంధీకి స‌మ‌న్లు జారీ చేసింది.

రాహుల్ గాంధీని ఐదు రోజుల పాటు విచారించింది. ఇదే స‌మ‌యంలో సోనియా గాంధీకి క‌రోనా సోకింది. దీంతో ఆమెకు వెసులుబాటు ఇచ్చింది ఈడీ. ఇదే క్ర‌మంలో సోనియా ఈడీ ముందుకు హాజ‌ర‌య్యారు.

కొన్ని గంట‌ల పాటు ఆమెను విచారించారు. వ‌య‌స్సు రీత్యా మ‌రోసారి త‌మ ముందుకు రావాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం సోనియా గాంధీ(Sonia Gandhi) వ‌య‌స్సు 75 ఏళ్లు.

తాము ఎలాంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌లేద‌ని ఈ సంద‌ర్భంగా వెల్లడించారు ప‌దే ప‌దే సోనియా, రాహుల్ లు.

Also Read : అరెస్ట్ శిక్షార్హ‌మైన సాధ‌నం కాదు – సుప్రీం కోర్టు

Leave A Reply

Your Email Id will not be published!