Sonia Rahul Pay Homage : ఊమెన్ చాందీకి సోనియా నివాళి

సోనియా..రాహుల్..ఖ‌ర్గే

Sonia Rahul Pay Homage : కేర‌ళ మాజీ సీఎం ఊమెన్ చాందీ చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం క‌న్నుమూశారు. ఆయ‌న గ‌త కొంత అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. రాష్ట్ర రాజ‌కీయాల‌లో త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చారు. ఊమెన్ చాందీ రెండుసార్లు కేర‌ళ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. ఆయ‌న‌ను అన్ని వ‌ర్గాల వారు ఆద‌రించారు. 11 సార్లు ప్ర‌జా ప్ర‌తినిధిగా ఎన్నిక‌య్యారు. కేర‌ళ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఇది ఓ రికార్డు.

Sonia Rahul Pay Homage

విప‌క్షాల భేటీ సంద‌ర్భంగా ఇవాళ బెంగ‌ళూరులో భేటీ అయ్యారు సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే , మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi) , జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా మాజీ సీఎం మృతికి సంతాపం వ్య‌క్తం చేశారు సోనియా..రాహుల్..ఖ‌ర్గే. ఆయ‌న భౌతికంగా లేక పోవ‌డం బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు.

136 ఏళ్ల సుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీకి ఊమెన్ చాందీ క‌న్నుమూయ‌డం పెద్ద న‌ష్ట‌మని స్ప‌ష్టం చేశారు. పార్టీ ప‌రంగా ఆయ‌న చేసిన సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని పేర్కొన్నారు. చివ‌రి దాకా అజాత శ‌త్రువుగా పేరు పొందార‌ని కొనియాడారు. ఎప్పుడు క‌లిసినా పార్టీ గురించి ఆలోచించే వార‌ని గుర్తు చేసుకున్నారు సోనియా గాంధీ.

Also Read : CM YS Jagan : చిరు వ్యాపారుల‌కు జ‌గ‌న్ ఆస‌రా

 

Leave A Reply

Your Email Id will not be published!