Udhayanidhi Stalin : త్వ‌ర‌లో ‘ఉద‌య‌నిధి’కి కేబినెట్ లో ఛాన్స్

త‌మిళ‌నాట రైజింగ్ స‌న్ గా పేరొందిన స్టాలిన్

Udhayanidhi Stalin : త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చిన యువ నాయ‌కుడిగా గుర్తింపు పొందారు ఉద‌య‌నిధి స్టాలిన్. త‌న తాత క‌రుణానిధికి అస‌లైన వార‌సుడిగా తండ్రి ఎంకే స్టాలిన్ కు సిస‌లైన త‌న‌యుడిగా ఇప్ప‌టికే త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇటీవ‌ల రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తండ్రికి కుడి భుజంగా ఉన్నారు.

యువ‌త‌ను కూడ‌గ‌ట్ట‌డంలో వారిని చేర‌దీయ‌డంలో, ఓట్లుగా మ‌ల్చ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఆపై డీఎంకే ప‌వ‌ర్ లోకి రావ‌డంలో ముఖ్య భూమిక పోషించాడు ఉద‌య‌నిధి స్టాలిన్(Udhayanidhi Stalin) . ఆయ‌న‌కు రైజింగ్ స‌న్ గా పేరుంది. స్టాలిన్ కుటుండం నుండి ఎదిగ‌న మూడో త‌రం నాయ‌కుడు.

ఉద‌య‌నిధి స్టాలిన్ కు ఇప్పుడు 46 ఏళ్లు. 2019లో యువ‌జ‌న విభాగం కార్య‌ద‌ర్శిగా నియ‌మితుల‌య్యాడు. ఈ ప‌ద‌విలో త‌న తండ్రి ప్ర‌స్తుత సీఎం ఎంకే స్టాలిన్ మూడు ద‌శాబ్దాల‌కు పైగా కొన‌సాగారు. ఇక ఉద‌య‌నిధి స్టాలిన్ రాజ‌కీయ రంగంలోనే కాదు సినీ రంగంలో కూడా ప్ర‌త్యేక ముద్ర క‌న‌బ‌రుస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇదిలా ఉండ‌గా విశ్వ‌స‌నీయ స‌మాచారం. ప్ర‌స్తుతం ఉద‌య‌నిధి స్టాలిన్ చేపాక్ – తిరువ‌ల్లికేణి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. డిఎంకే యువ‌జ‌న విభాగం కార్య‌ద‌ర్శిగా ఉన్న ఆయ‌న త్వ‌ర‌లోనే కేబినెట్ లో చేర‌నున్నారు.

ఈ మేర‌కు రాష్ట్ర గ్రామీణాభివృద్ది , ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల పోర్ట్ ఫోలియోను చేప‌ట్ట‌నున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌మిళ‌నాడు స్టార్ క్యాంపెయిన‌ర్ల‌లో ఒక‌రిగా త‌న‌దైన ప్ర‌భావం చూపారు ఉద‌యినిధి స్టాలిన్(Udhayanidhi Stalin) .

చాలా మంది పార్టీ శ్రేణులు ఉద‌యినిధికి మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని ప‌ట్టు ప‌డుతుండ‌డంతో సీఎం ఓకే చెప్పిన‌ట్లు టాక్.

Also Read : ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు గ‌ట్టెక్కించ లేవు

Leave A Reply

Your Email Id will not be published!