Amit Shah SZC : కోవలంలో దక్షిణ జోనల్ కౌన్సిల్
ప్రారంభించనున్న కేంద్ర మంత్రి షా
Amit Shah SZC : ఇది ఊహించని పరిణామం. కేరళలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువు తీరింది. ఇదిలా ఉండగా కీలకమైన సమావేశానికి వేదిక కాబోతోంది ఆ రాష్ట్రం.
కోవలంలో దక్షిణ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది సెప్టెంబర్ 3 శనివారం రోజు. ఎస్జీసీ కీలక మీటింగ్ ను ప్రారంభించనున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah SZC).
ఈ కీలక సమావేశానికి ఐదు దక్షిణ భారత రాష్ట్రాలు నదీ జలాల భాగస్వామ్యం , తీర ప్రాంత భద్రత, కనెక్టివిటీ , అంతర్ రాష్ట్ర నేర నిర్వహణ , ఇతర ఉమ్మడి ప్రయోజనాల వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు.
కేరళ రాజధాని తిరువనంతపురంకు దక్షిణంగా 16 కిలోమీటర్ల దూరంలోని కోవలంలో దక్షిణ జోనల్ కౌన్సిల్ సమావేశం కీలకం కానుంది. ప్రత్యేకించి అమిత్ షా రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సౌత్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చరి పాల్గొంటున్నాయి.
ఈ మొత్తం వాటికి కేంద్ర హోం శాఖ మంత్రి చైర్మన్ గా ఉంటారు. కేరళతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి సీఎంలు హాజరవుతారని కేరళ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది.
ఇదిలా ఉండగా ఈ కీలక మీటింగ్ కు కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ సీఎంలు తమ ప్రతినిధులను డిప్యూటీ చేయనున్నారు.
దేశంలో పోటీ ఫెడరలిజాన్ని బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా కేంద్ర సర్కార్ ప్రతి ఏటా సమావేశాలను క్రమంత తప్పకుండా నిర్వహిస్తూ వస్తోంది.
Also Read : ఫోగట్ కేసులో నిందితులు కస్టడీకి