Nitish Kumar : ప‌వ‌ర్ లోకి వ‌స్తే రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక హోదా

సీఎం నితీశ్ కుమార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

Nitish Kumar : జాతీయ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసే నాయ‌కులు ఒక‌డిగా ఉన్నారు జేడీయూ చీఫ్‌, బీహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar). 17 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న అనంత‌రం భార‌తీయ జ‌న‌తా పార్టీని ఆయ‌న టార్గెట్ చేశారు.

ఇప్ప‌టికే విప‌క్షాల‌న్నీ ఏకం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌క‌టించారు. అంతే కాదు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సీపీఎం నేత సీతారాం ఏచూరినీ క‌లిశారు.

అనంత‌రం ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ తో ఏకాంతంగా భేటీ అయ్యారు. వీరి మ‌ధ్య దేశ రాజ‌కీయాలు, చేప‌ట్టాల్సిన వ్యూహాల‌పై ఫోక‌స్ పెట్టిన‌ట్లు టాక్. ప్ర‌తిప‌క్షాల‌ను ఏక‌తాటిపైకి తీసుకు వ‌చ్చే చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశారు నితీశ్ కుమార్(Nitish Kumar).

గురువారం ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. 2024లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షాలు ప‌వ‌ర్ లోకి వ‌స్తే గ‌నుక దేశంలోని అన్నిరాష్ట్రాల‌కు ప్ర‌త్యేక హోదా క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా బీహార్ కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని నితీశ్ కుమార్ గ‌త 2007 నుండి డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత బీజేపీయేత‌ర పార్టీలు ప్ర‌భుత్వాన్ని గ‌నుక ఏర్పాటు చేస్తే ఈ డిమాండ్ ఒక్క బీహార్ కే కాకుండా దేశంలోని ప్ర‌తి రాష్ట్రానికి వ‌ర్తింప చేసేలా తాను ప్ర‌య‌త్నం చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు నితీశ్ కుమార్(Nitish Kumar).

ప్ర‌స్తుతం దేశంలో 11 ప్ర‌త్యేక కేట‌గిరీ రాష్ట్రాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్ర‌చార ఆర్భాటం త‌ప్ప ఆచ‌ర‌ణ‌లో అది చేసింది ఏమీ లేద‌న్నారు సీఎం.

Also Read : నేరం చేయాలంటే వ‌ణ‌కాల్సిందే – పాఠ‌క్

Leave A Reply

Your Email Id will not be published!