Simha Vahanam : సింహ వాహనంపై తేజోమూర్తి
ఘనంగా శ్రీ గోవింద రాజ స్వామి బ్రహ్మోత్సవం
Simha Vahanam : తిరుపతిలోని శ్రీ గోవింద రాజ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు అనంత తేజో మూర్తిగా భాసిల్లుతున్న, భక్తులతో కొలువబడుతున్న శ్రీ గోవింద రాజ స్వామి సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవ వైభవోపేతంగా జరిగింది.
వాహనం ముందు గజ రాజులు నడుస్తుండగా భక్త జన బృందాలు కోలాటాలతో హోరెత్తించారు. ఇక మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.
మృగాల్లో రారాజజు సింహం , గాంభీర్యానికి ప్రతీక. యోగ శాస్త్రంలో సింహం వాహన శక్తికి , శీఘ్ర గమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు భక్తులు. స్వామి వారు రాక్షసుల మనసులలో సింహంలా గోచరిస్తాడని స్త్రోత్ర వాజ్మయం కీర్తిస్తోంది. అంతకు ముందు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారిఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు , పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు చందనాలతో అభిషేకం చేశారు.
రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ గోవింద రాజ స్వామి వారు ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.
Also Read : TTD EO AV Dharma Reddy