Pavitrotsavams Concludes : ముగిసిన ప‌విత్రోత్స‌వాలు

కోదండ రామ స్వామి ఆల‌యం

Pavitrotsavams Concludes : తిరుప‌తిలో కొలువు తీరిన శ్రీ కోదండ రామ‌స్వామి ఆల‌యంలో నిర్వ‌హిస్తూ వ‌స్తున్న ప‌విత్రోత్స‌వాలు ముగిశాయి. పూర్ణాహుతితో పూర్త‌య్యాయి. ఈ ఉత్స‌వాలు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) ఆధ్వ‌ర్యంలో జ‌రిగాయి. ముందుగా యాగ శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అనంత‌రం ఉత్స‌వ మూర్తుల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం అంగ‌రంగ వైభవంగా చేప‌ట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, ప‌సుపు , చంద‌నం, కొబ్బ‌రి నీళ్ల‌తో విశేషంగా అభిషేకం జ‌రిపించారు పూజారులు.

శ్రీ సీతారామ ల‌క్ష్మ‌ణులు బంగారు తిరుచ్చిపై ఆల‌య మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు. ఆ త‌ర్వాత యాగ శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రిపారు. పూర్ణాహుతి, ఉత్స‌వ మూర్తుల‌ను , ప్ర‌ధాన కుంభాన్ని విమాన ప్ర‌ద‌క్షిణంగా స‌న్నిధికి చేర్చారు. కుంభ ఆవాహ‌న‌, త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు ప‌విత్ర ఉత్స‌వాలను పుర‌స్క‌రించుకుని.

శ్రీ కోదండ రామ స్వామి ప‌విత్రోత్స‌వాల‌కు భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్న భ‌క్తులు ఆ త‌ర్వాత దిగు తిరుప‌తికి వేంచేశారు. ఉత్స‌వాలు ఈవో నాగ‌ర‌త్న‌, ఏఈవో పార్థ సార‌థి, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు మోహ‌న రంగాచార్యులు, కంక‌ణ భ‌ట్టార్ ఆనంద్ కుమార్ దీక్షితులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Also Read : Tirumala Rush : తిరుమ‌ల‌లో పోటెత్తిన భ‌క్తులు

Leave A Reply

Your Email Id will not be published!