Sri Lanka Court : శ్రీలంక మాజీ ప్రధాన మంత్రి మహింద రాజపక్సకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయనతో పాటు మిత్రపక్షాలకు చెందిన నాయకులు ఎవరూ దేశం విడిచి వెళ్లడానికి వీలు లేదంటూ కోర్టు (Sri Lanka Court )గురువారం సంచలన తీర్పు చెప్పింది.
ఈ మేరకు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశ రాజధాని కొలంబోలోని మేజిస్ట్రేట్ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారి పట్ల దాడులుకు తెగ బడటాన్ని తప్పు పట్టింది.
ఈ దాడులపై దర్యాపు చేపట్టాలని ఆదేశించింది కోర్టు(Sri Lanka Court ). వారిపై దాడులకు దిగడం వల్లనే ప్రతీకార హింసకు దారి తీసిందంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈనెల 9న జరిగిన హింసలో తొమ్మిది మంది బలయ్యారు. వీరిలో అధికార పార్టీకి చెందిన ఎంపీ కూడా ఉన్నారు. ప్రస్తుత ఎంపీతో పాటు మాజీ మంత్రి ఇళ్లకు నిరసనకారులు నిప్పంటించారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనకారులపై హింసాత్మక చరయలకు పాల్పడినందుకు శ్రీలంక మాజీ ప్రధాన మంత్రి మహింద రాజపక్సే , రాజకీయ నాయకుడు నమల్, 15 మంది మిత్రులు దేశం విడిచి వెళ్లవద్దంటూ ఆదేశించింది.
ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కోర్టు. శ్రీలంక ఆర్థిక సంక్షోభంలోకి కూరుకు పోవడానికి ప్రధాన కారణం మాజీ ప్రధానియే కారణమంటూ ప్రజలు రోడ్డెక్కారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఆహారం, నిత్యావసరాల ధరలు భరించ లేనివిగా తయారయ్యాయి.
ఇదే సమయంలో పరిస్థితి అదుపు తప్పడంతో శ్రీలంక దేశాధ్యక్షుడు కనిపిస్తే కాల్చి వేత ఆర్డర్స్ పాస్ చేశారు. ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. నిరసనకారులు, ఆందోళనకారులు మహింద, ప్రెసిడెంట్ రాజపక్సలపై నిప్పులు చెరుగుతున్నారు.
ఒకానొక దశలో ప్రెసిడెంట్ నివాసాన్ని ముట్టడించారు. ఇదే సమయంలో దేశం విడిచి పారిపోకుండా మహింద కోసం కాపలా కాస్తున్నారు.
Also Read : చైనా ఫ్లైట్ జెట్ టేకాఫ్ లో మంటలు