Sri Lanka Crisis : లంక సంక్షోభం భార‌త్ జోక్యం అవ‌స‌రం

కేంద్రాన్ని కోరిన డీఎంకే, అన్నాడీఎంకే

Sri Lanka Crisis : శ్రీ‌లంక‌లో సంక్షోభం తారా స్థాయికి చేరింది. దేశ అధ్య‌క్షుడు గోట‌బ‌య రాజ‌ప‌క్సే దేశం విడిచి పారి పోయాడు. అధ్య‌క్షుడి భ‌వ‌నం ఇప్పుడు ఆందోళ‌న‌కారుల్లో చేతుల్లో ఉంది.

ఆర్మీ చీఫ్ మాత్రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. ప్ర‌జ‌ల ఆస్తుల‌ను ధ్వంసం చేయొద్ద‌ని కోరుతున్నారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా శ్రీ‌లంక‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని కోరారు.

ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా చేసిన మ‌హీంద రాజ‌ప‌క్సే ప్రాణ‌భ‌యంతో ఆర్మీ క్యాంపులో త‌ల‌దాచుకున్నాడు. దీంతో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజ‌ప‌క్సే కుటుంబీకులు ఎవ‌రూ దేశం విడిచి వెళ్ల కూడ‌దంటూ ఆదేశించింది.

ఇక నాలుగైదు రోజుల్లో శ్రీ‌లంక‌కు కొత్త అధ్య‌క్షుడిని ఎన్నుకోబోతున్నారు. ఈ త‌రుణంలో త‌మిళ‌నాడుకు చెందిన ప్ర‌ధాన పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే సంచ‌ల‌న కామెంట్స్ చేశాయి.

వెంట‌నే కేంద్ర స‌ర్కార్ శ్రీ‌లంక సంక్షోభంలో(Sri Lanka Crisis) జోక్యం చేసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు బీజేపీ స‌కీర్ణ ప్ర‌భుత్వం మంగ‌ళవారం అఖిల‌ప‌క్ష స‌మావేశానికి పిలుపునిచ్చింది.

అంత‌కు ముందు పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశానికి ముందు జ‌రిగిన పార్టీల స‌మావేశంలో ఈ అంశాన్ని లేవ‌నెత్తాయి ఆ రెండు పార్టీలు. నిర్మ‌లా సీతారామ‌న్ , డాక్ట‌ర్ ఎస్ . జై శంక‌ర్ దీనిపై జోక్యం చేసుకోవాల‌ని కోరారు. శ్రీలంక‌లో త‌మిళుల ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్నారు.

కేంద్రాన్ని శ్రీ‌లంక‌లో జోక్యం చేసుకోవాల‌ని కోరిన ఎంపీల‌లో డీఎంకేకు చెందిన టి. ఆర్. బాలు, అన్నాడీఎంకేకు చెందిన ఎంపీ ఎం. తంబిదురై ఉన్నారు.

Also Read : అఖిల‌ప‌క్ష మీటింగ్ కు మోదీ గైర్హాజ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!