Sri Lanka India : శ్రీ‌లంక సంక్షోభం భార‌త్ కు గుణ‌పాఠం

ఇక‌నైనా భార‌తీయ పాల‌కులు మారాలి

Sri Lanka India : పొరుగున ఉన్న ద్వీప దేశం శ్రీ‌లంక‌లో చోటు చేసుకున్న సంక్షోభం భార‌త దేశానికే(Sri Lanka India) కాదు యావ‌త్ ప్ర‌పంచానికి ఓ గుణ‌పాఠం అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ప్ర‌జాస్వామ్య‌మైనా లేదా రాచ‌రిక‌మైనా , దేశాధ్య‌క్షుల పాల‌నైనా ఏ ప‌ద్ధ‌తిలో కొలువు తీరినా అంతిమంగా ప్ర‌జా శ్రేయ‌స్సే పాల‌కుల‌కు,

ప్ర‌భుత్వాల‌కు ప‌ర‌మావ‌ధిగా కావాలి. లేక పోతే తాజాగా ప్ర‌జ‌లు చేప‌ట్టిన నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు మ‌న ఇండియాలో కూడా చోటు చేసుకుంటాయి.

ఇప్ప‌టికే పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు మంట మండుతున్నాయి. ఇక వంటింట్లో నిత్య అవ‌స‌రంగా మారిన వంట గ్యాస్ గుండె కోత మిగులుస్తోంది.

ల‌క్ష‌లాది మంది నిరుద్యోగులు ఇవాళ రోడ్డెక్కారు. సంక్షేమ జ‌పం చేస్తున్న ప్ర‌భుత్వాలు చివ‌ర‌కు ప్ర‌జ‌లు చెల్లిస్తున్న డ‌బ్బుల‌తో జ‌ల్సాలు చేస్తుండ‌డం ఒకింత బాధ‌కు గురి చేస్తోంది.

ఎంత‌కాలమ‌ని ఆర్మీ నీడ‌లో బ‌తుకుతారో అర్థం చేసుకోవాలి. ఇవాళ 75 సంవ‌త్స‌రాలు పూర్త‌యిన సంంద‌ర్భంగా ఆజాదీకా మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మాన్ని జ‌రుపుకుంటోంది దేశం.

కానీ నేటికీ ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ద్ర‌వ్యోల్బ‌ణం, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం పెచ్చ‌రిల్లి పోయింది.

ఇవాళ నివురుగ‌ప్పిన నిప్పులాగా ఉంది. అది ఏదో ఒక‌రోజు బ‌య‌ట‌కు రాక త‌ప్ప‌దు. ఆరోజు పాల‌కులు త‌ప్పుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది.

వ్యాపార‌వేత్త‌లు ఈ దేశాన్ని ఎప్పుడూ ఆదాయ వ‌న‌రుగా చూస్తారే త‌ప్పా దేశం కోసం ఎప్పుడూ ప‌ని చేసిన దాఖ‌లాలు లేవు. ఇక‌నైనా భార‌త్(Sri Lanka India) త‌న తీరు మార్చుకోవాలి. లేక పోతే క‌ష్టం. ప్ర‌భుత్వ ఆస్తుల‌ను గంప గుత్త‌గా అమ్మితే ఏం వ‌స్తుందో పాల‌కులు దేశానికి చెప్పాలి.

Also Read : ప్ర‌జాగ్ర‌హం ముందు పాల‌కులు బ‌లాదూర్

Leave A Reply

Your Email Id will not be published!