Sri Lanka Crisis : తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న శ్రీలంక (Sri Lanka Crisis )కోలుకోలేని రీతిలో దేశానికి చేదు వార్త చెప్పింది. తమ దేశపు విదేశీ నిల్వలు $50 మిలియన్ల దిగువకు పడి పోయినట్లు మంత్రి ప్రకటించారు.
దీంతో రెడ్ బెల్స్ మోగుతున్నట్లు అనిపిస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు శ్రీలంక ఆర్థిక మంత్రి ఆలీ సబ్రీ. లంక పార్లమెంట్ లో ద్రవ్య నిల్వలు క్షీణించాయని వెల్లడించారు.
50 మిలియన్ డాలర్ల కంటే తక్కువకు పడి పోవడం ప్రమాద ఘంటికలను తెలియ చేస్తోంది. ఆ దేశం ఎదుర్కొంటున్న విపత్కర ఆర్థిక పరిస్థితి గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది దేశ వ్యాప్తంగా.
ఇప్పటికే పెట్రోల్, డీజిల్, నిత్యావసరాలు అందక జనం హాహాకారాలు చేస్తున్నారు. ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. కొలంబోలో ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా పెద్ద ఎతతున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
ఓ వైపు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ద్వీప దేశానికి సంబంధించిన జాతీయ జెండాను ఎగుర వేయడం ఆ దేశం పట్ల తమకున్న గౌరవాన్ని తెలియచేస్తోంది.
ఏది ఏమైనా పాలకుల అనాలోచిత నిర్ణయాలే శ్రీలంకను(Sri Lanka Crisis )కొంప ముంచేలా చేశాయని మాజీ క్రికెటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పౌరులకు ఆహారం, ఇంధనం, ఇతర అవసరమైన వస్తువులను అందించగల సామర్థ్యం, భారీ విదేశీ అప్పులను తిరిగి చెల్లించే సామర్థ్యంపై ఆందోళనను మరింత పెంచేలా చేసింది ఆర్థిక మంత్రి ప్రకటన.
ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. 2021లో మొత్తం ఆదాయం 1,500 బిలియన్ల రూపాయలు. ఖర్చు 3, 522 బిలియన్లు. శక్తికి మించి ఖర్చు చేస్తున్నామని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
శ్రీలంక దివాలా అంచున ఉంది. విదేశీ రుణాలపై చెల్లింపులను నిలిపి వేసింది.
Also Read : డిజిటల్ చెల్లింపుల్లో భారత్ టాప్ – మోదీ