Sri Lanka Crisis : శ్రీలంకలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతున్నాయి. రోజు రోజుకు పరిస్థితి అదుపు తప్పుతోంది. ప్రజలు, యువతీ యువకులు రోడ్లపైకి వచ్చారు. వారిని కంట్రోల్ చేయడం ఆర్మీ చేత కావడం లేదు.
దీంతో దిగ జారుతున్న ఆర్థిక పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టారు ఆ దేశ అధ్యక్షుడు రాజపక్స. నిరసనలు పెరుగుతున్నందున ప్రభుత్వంలో చేరాలంటూ ప్రతిపక్షాలను (Sri Lanka Crisis)ఆహ్వానించాడు.
ఇది కీలక పరిణామం అని చెప్పక తప్పదు. దక్షిణాసియాలోని శ్రీలంక దేశం ఇప్పుడు కనీవిని ఎరుగని రీతిలో ఆహారం, ఇంధనం కొరత ఎదుర్కొంటోంది. ఇప్పటికే భారత దేశం 40 వేల మిలియన్ల లీటర్ల డీజిల్ ను సాయంగా అందించింది శ్రీలంకకు.
ఈ తరుణంలో నిన్న ఆ దేశ ప్రధాన మంత్రి మహింద రాజపక్సతో పాటు మంత్రివర్గం మూకుమ్మడిగా రాజీనామా సమర్పించింది. ప్రస్తుతం సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక బెయిలౌట్ కోసం ఐఎంఎఫ్ తో చర్చలు జరుపుతోంది.
కాగా కొనసాగుతున్న ఆర్థిక కష్టాలపై ప్రజల ఆగ్రహాన్ని తట్టుకునేందుకు కొత్త ప్రయత్నం మొదలు పెట్టారు దేశాధ్యక్షుడు. ఇవాళ కొత్త మంత్రివర్గం కొలువు తీరనుంది.
ఈ సందర్బంగా కీలక ప్రకటన చేశాడు ప్రెసిడెంట్. జాతీయ సంక్షోభానికి (Sri Lanka Crisis)పరిష్కారం కనుగొనేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా విపక్షాలు ప్రభుత్వంలో పాలు పంచు కోవాలని ఆహ్వానం పలికారు.
శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అజిత్ నిబార్ట్ కబ్రాల్ తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. ఏం జరుగుతుందో తెలియడం లేదు.
Also Read : కుట్ర నిజం దౌత్యవేత్తపై ఆగ్రహం