Sri Lanka Protest : ఆగని సంక్షోభం అధ్యక్షుడిపై ఆగ్రహం
శ్రీలంకలో ఎమర్జెన్సీ పొడించిన రణిలె
Sri Lanka Protest : శ్రీలంకలో అధ్యక్షుడు మారినా పరిస్థితులలో ఎలాంటి మార్పులు(Sri Lanka Protest) కనిపించడం లేదు. జనం రోడ్లపైకి వచ్చారు. నిరంకుశ, రాచరిక పాలన సాగించిన గోటబయ రాజపక్సెను సాగనంపిన ప్రజలు ఇప్పటికీ రణిలె విక్రమసింఘెను అధ్యక్షుడిగా ఉండేందుకు ఒప్పు కోవడం లేదు.
గోటబయకు మద్దతుదారుడంటూ ఇప్పటికే రణిలె ఇంటికి నిప్పంటించారు. ఆయన వ్యక్తిగత వాహనాలను ధ్వంసం చేసి తగులబెట్టారు.
ఇక దేశానికి చెందిన ఆర్మీ చీఫ్ మాత్రం సంయమనం పాటించాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని పిలుపునిచ్చారు.
పరిస్థితులు తగ్గేంత దాకా ఓపికతో ఉండాలని కోరారు. అయినా జనం ఆగడం లేదు. ఇప్పటికే ఆర్థిక, ఆహార, గ్యాస్, ఆయిల్, విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది శ్రీలంక.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో రణిలె భారీ మెజారిటీతో అధ్యక్షుడిగా ఎన్నికైనా ఆయనను ఒప్పుకోవడం లేదు మెజారిటీ ప్రజలు. తమకు న్యాయం చేసేంత వరకు కదిలే ప్రసక్తి లేదంటున్నారు.
దీంతో పరిస్థితి సద్దుమణిగేంత వరకు దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు దేశ అధ్యక్షుడు రణిలె విక్రమ సింఘే. మరో వైపు మాజీ ప్రధాని మహీంద రాజపక్సే మాత్రం నేవీ, ఆర్మీ క్యాంపులో దాచుకున్నాడు.
ప్రెసిడెంట్ నిర్ణయాన్ని తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు జనం. దేశ అధ్యక్షుడి భవనాన్ని ఆక్రమించుకున్నారు. భవనం ముందున్న టెంట్లను, ఆందోళనకారులను చెదరగొట్టడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు.
మొత్తంగా శ్రీలంక పరిస్థితి రావణ కాష్టాన్ని తలపింప చేస్తోంది. మరో వైపు గోటబయ రాజపక్స సింగపూర్ లో తలదాచుకున్నాడు.
Also Read : విదేశీ పర్యటనలో సౌదీ యువరాజు