Sri Lanka Protest : శ్రీలంక సంక్షోభం ముదురుతోంది. జనం నిరసనలు మిన్నంటాయి. ప్రెసిడెంట్ మాత్రం ససేమిరా అంటున్నారు. ఈ మొత్తం అనిశ్చితి, ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం ప్రభుత్వమేనంటూ ఆరోపిస్తున్నా రు ప్రజలు.
బైక్ లపై సైనికులు, స్థానిక పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. ఇదిలా ఉండగా యూనిటీ అడ్మినిస్ట్రేషన్ లో చేరాలన్న దేశాధ్యక్షుడు రాజపక్సే ఇచ్చిన పిలుపును తిరస్కరించాయి ప్రతిపక్షాలు.
దేశ రాజధాని కొలంబోలో నిరసనకారుల గుంపు పైకి సైనికులు రైఫిల్స్ (Sri Lanka Protest )ఉపయోగించడంపై పోలీసులు అడ్డు పడ్డారు. పిల్లలు, మహిళలు, వృద్దులు కూడా పాల్గొన్నారు ఈ నిరసనలో. పార్లమెంట్ సమీపంలో ఈ ఆందోళన చోటు చేసుకుంది.
అయితే ముసుగు ధరించిన సైనికుల టీం రైపిళ్లను పట్టుకుని వెళ్లడాన్ని పోలీసులు అభ్యంతరం పలికారు. దీంతో సైనికులు, పోలీసుల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది.
దీంతో మంగళవారం అర్ధరాత్రి శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ఏప్రిల్ 1న ప్రకటించిన అత్యవసర పరిస్థితిని రద్దు చేశారు. దశాబ్దాలుగా ఆర్థిక సంక్షోభం కొనసాగుతూ వస్తోంది.
41 మంది శాసనసభ్యులు కూటమి నుంచి తప్పుకున్నారు. దీంతో పాలక సంకీర్ణం పార్లమెంట్ లో మెజారిటీని కోల్పోయింది. మిత్రపక్షాలు, ప్రతిపక్షాలు ప్రెసిడెంట్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ (Sri Lanka Protest )చేశాయి.
ఆర్థిక మంత్రి అలీ సబ్రీ తన పదవికి రాజీనామా చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనపై శ్రీలంకపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకో వైపు ద్రవ్య నిధి లోటు పూడ్చాలంటే ఐఎంఎఫ్ రుణాలు కావాలి.
Also Read : ఐక్యరాజ్య సమితిపై జెలెన్ స్కీ ఫైర్