Sri Lanka 5 years Visas : భారత వ్యాపారులకు శ్రీలంక ఆఫర్
ఐదు సంవత్సరాల పాటు వీసా వెసులుబాటు
Sri Lanka 5 years Visas : శ్రీలంక సంక్షోభం నెలకొన్న ప్రస్తుత తరుణంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తమ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు గాను బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఇందులో భాగంగా భారత దేశానికి చెందిన వ్యాపారవేత్తలకు ఐదేళ్ల పాటు చెల్లుబాటు అయ్యేలా వీసాలు ఇస్తున్నట్లు (Sri Lanka 5 years Visas) ప్రకటించింది.
శ్రీలంకలో వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించడం , పెట్టుబడులను ప్రోత్సహించడంలో ఇది స్వాగతించే చర్యగా అని భారత హై కమిషన్ పేర్కొంది.
ఇదిలా ఉండగా శ్రీలంక ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మానవతా దృక్ఫథంతో భారత ప్రభుత్వం శ్రీలంకకు సహాయం ప్రకటించింది.
ఆయిల్ తో పాటు ఆహార కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకుంది. వీటి విలువ మొత్తం బిలియన్ డాలర్లకు పైగానే ఉంటుందని అంచనా.
తాజాగా ఆర్థికంగా ప్రస్తుత పరిస్థితిని నుంచి గట్టెక్కాలంటే తమ దేశంలో ఇన్వెస్ట్ మెంట్స్ రావాల్సి ఉందని శ్రీలంక ప్రభుత్వం భావించింది.
కేంద్ర మంత్రి ధమ్మిక పెరీరా ద్వీప దేశంలోని భారతీయ వ్యాపారవేత్తలకు ఐదేళ్ల పాటు వీసాలు జారీ చేయాలని నిర్ణయించారు. దీని వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార బంధాలు మరింత బలపడతాయని స్పష్టం చేశారు పెరీరా.
ఇదిలా ఉండగా కొలంబో లోని భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే శ్రీలంక వాణిజ్య మంత్రితో సమావేశం అయ్యారు. వాణిజ్యానికి సంబంధించి విభన్న కోణాలపై చర్చించారు.
మానవతా సాయం, వంట గ్యాస్ , పెద్ద మొత్తంలో ఇంధనం, ఔషధ సామాగ్రితో కూడిన ఓడల లోడ్ తో పాటు డబ్బుతో ఇబ్బందులు పడుతున్న శ్రీలంక ప్రభుత్వాన్ని రక్షించేందుకు భారత్ ముందుకు వచ్చింది.
Also Read : కారణం లేకుండానే అడ్డుకున్నారు