TTD Brahmotsavam : వైభ‌వోపేతం శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వం

క‌ల్కి అవ‌తారంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం

TTD Brahmotsavam : తిరుమ‌ల‌లో శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు(TTD Brahmotsavam) ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. శ్రీ స్వామి వారు క‌ల్కి అవ‌తారంలో ద‌ర్శ‌నం ఇచ్చారు. . మ‌ల‌య‌ప్ప స్వామి అశ్వ‌వాహ‌నంపై ఊరేగారు.

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసింది. అయినా ద‌ర్శ‌నం చేసుకోవాలంటే చాలా సేపు నిరీక్షించాల్సి ఉంది.

మంగ‌ళ వాయిద్యాల మ‌ధ్య వేంక‌టేశ్వ‌రస్వామికి న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో ఉత్స‌వాలు జ‌రిగాయి. వాహ‌న సేవ‌లో పెద్ద జీయ‌ర్ స్వామి, చిన్న జీయ‌ర్ స్వామి, సుప్రీంకోర్టు మాజీ సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌, జార్ఖండ్ హైకోర్టు సీజే ర‌వి రంజ‌న్ , టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధ‌ర్మారెడ్డి, బోర్డు మెంబ‌ర్స్ నంద‌కుమార్ , రామేశ్వ‌ర్ రావు, మ‌ధుసూద‌న్ యాద‌వ్ , మారుతి ప్ర‌సాద్, ఢిల్లీ స్థానిక స‌ల‌హా మండ‌లి అధ్య‌క్షురాలు ప్ర‌శాంతి రెడ్డి, జీఈఓ స‌దా భార్గ‌వి, వీర బ్ర‌హ్మం , సీవీఎస్ఓ న‌ర‌సింహ కిషోర్ పాల్గొన్నారు.

అంత‌కు ముందు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(CM Jagan) ఎప్ప‌టి లాగే ఉత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌భుత్వం త‌రపు నుంచి ప‌ట్టు వ‌స్తాలు స‌మర్పించారు. తండోప తండాలుగా త‌ర‌లి వ‌స్తున్న భ‌క్తుల‌కు ఏర్పాట్లు చేయ‌డం టీటీడీకి త‌ల‌కు మించిన భారంగా మారింది.

ఇదిలా ఉండ‌గా శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ఎలాంటి సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి. ఇదిలా ఉండ‌గా రెండేళ్లుగా క‌రోనా కార‌ణంగా తిరుమ‌ల‌లో బ్ర‌హ్మోత్స‌వాల‌ను నిర్వ‌హించ లేదు.

Also Read : దేశ‌మంత‌టా బీఆర్ఎస్ జెండా ఎగ‌రాలి

Leave A Reply

Your Email Id will not be published!