Statue Of Equality : హైదరాబాద్ లోని ముచ్చింతల్ వైపు దేశం చూస్తోంది. యావత్ భారతం నలుమూలల నుంచి తండోప తండాలుగా తరలి వస్తున్నారు సమతామూర్తిని దర్శించుకునేందుకు.
రామానుజుడి చూపిన మార్గాన్ని, ఆయన కోరిన అంతా సమానులేనన్న భావనను భావి తరాలకు అందించేందుకు వెయ్యేళ్ల అనంతరం రూ. 1000 కోట్ల భారీ ఖర్చుతో 216 అడుగులతో శ్రీ రామానుజుడి సమతామూర్తిని(Statue Of Equality )ఏర్పాటు చేశారు.
ప్రపంచంలోని అద్భుతాలలో కూడా ఇది ఒకటిగా నిలిచి పోతుందని దర్శించుకున్న ప్రముఖులు పేర్కొంటున్నారు. దైవం అందరికీ సమానమేనని, ఆలయంలో ప్రతి ఒక్కరికి దర్శించుకునే అవకాశం ఉండాలని కోరారు ఆనాడే రామానుజుడు.
ఒక రకంగా ఆధ్యాత్మిక రంగంలో ఓ విప్లవకారుడిగా అభివర్ణిస్తారు. క్రీ. శ. 1017 కాలంలో తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్ లో పుట్టిన శ్రీ రామానుజాచార్యులు భారత దేశం అంతటా ప్రయాణం చేశారు.
అన్ని వర్గాల జీవన విధానాన్ని అర్థం చేసుకున్నారు. సకల వర్గాల జీవన విధానాన్ని అర్థం చేసుకుంటూ, వ్యక్తిగత అవసరాలపై దృష్టి పెట్టారు. అందరి క్షేమం, శ్రేయస్సు కోసం రామానుజుడు వేదాల సారాన్ని 9 గ్రంథాల రూపంలో అందించారు.
రామానుజుడు అనుసరించిన మార్గం ఆ తర్వాత ఎన్నో తరాలను ప్రభావితం చేస్తూ వచ్చింది. బాబా సాహెబ్ అంబేద్కర్ , మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద స్వామి సమతామూర్తి (Statue Of Equality )నుంచి స్ఫూర్తి పొందారు.
ఉన్నత వర్గాలను, సామాన్యులను భక్తి, దైవిక ప్రేమ మార్గంలో నడిపించేందుకు ఒప్పించేలా చేసింది. శ్రీ రామానుజాచార్యులు శ్రీ వైష్ణవ జ్యోతిని వెలిగించారు.
భక్తి ఉద్యమానికి గురువు. ప్రపంచం భ్రమ అనే మాయ వాద భావనను , అపోహలను తొలగించే ప్రయత్నం చేశాడు.మహా విష్ణువు పట్ల భక్తి లోతుల్లోకి ప్రవేశంచాడు.
కబీర్ , మీరాబాయి, అన్నమాచార్య, త్యాగరాజులు సమతామూర్తిని చూసి స్పూర్తి పొందారు.
కులాల మధ్య సమన్వయం పెంపొందించేందుకు ప్రయత్నం చేశారు.
Also Read : రామానుజుడి చెంతకు రాష్ట్రపతి