Sri Sri Sri Swaroopananda Swamy : లోక కళ్యాణం కోసం యాగం
శ్రీశ్రీశ్రీ శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ
Sri Sri Sri Swaroopananda Swamy : మానవ సమూహం ఆయురారోగ్యాలతో , అష్ట ఐశ్వర్యాలతో తలతూగాలని కోరుకుంటూ అయుత చండీ యాగం అతిరుద్రం చేపట్టడం జరిగిందని సందేశం ఇచ్చారు శ్రీశ్రీశ్రీ శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ . సేవా భావంతో మెలగడం , ధర్మ బద్దంగా జీవించడం అన్నది ముఖ్యమని స్పష్టం చేశారు.
Sri Sri Sri Swaroopananda Swamy Yagam Viral
తోటి వారిని ప్రేమతో ఆదరించడం నిత్యం అలవాటు చేసుకోవాలని సూచించారు. యాగ ఫలం అన్నది ప్రతి ఒక్కరికి అందలాన్నదే ముఖ్యమన్నారు. ఇది ప్రతి ఒక్కరికీ చేరుతుందన్నారు. యాగ స్థలం అన్నది అత్యంత పవిత్రమైనదని , దీనిలో పాల్గొన్న వారందరూ సమస్యల నుంచి, బాధల నుంచి విముక్తి పొందడం జరుగుతుందని తెలిపారు.
వైదిక ధర్మానుసారం నియమబద్దమైన జీవితం ఆచరించినప్పుడే అనుకున్నది సాధ్యమవుతుందని పేర్కొన్నారు శ్రీశ్రీశ్రీ శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ. సత్యం, ధర్మం ఆచరించ దగినవని సూచించారు. నిత్య పూజలు చేయడం, నియమ నిష్టలను అనుసరించి ఏకాగ్రతతో ఆచరించినప్పుడే ఆశించిన ఫలం నెరవేరుతుందన్నారు.
సాయం చేయడం అన్నది మన దైనందిన జీవితంలో భాగం కావాలని స్వామీజీ పిలుపునిచ్చారు. ఎక్కడ యాగం నిర్వహించినా ఆ యాగ ఫలితం ఆ ప్రాంతం వారికి దక్కుతుందని తెలిపారు. ఇందులో పాల్గొనడం కూడా అదృష్టంగా భావించాలని స్పష్టం చేశారు శ్రీశ్రీశ్రీ శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ.
కరుణ, దయ , సోదర భావం అన్నది నిత్య భాగం కావాలని పిలుపునిచ్చారు.
Also Read : Pothina Venkata Mahesh : టీటీడీని భ్రష్టు పట్టించిన జగన్