Ranil Wickremesinghe : రణిలెపై లంకేయుల రణనినాదం
అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలి
Ranil Wickremesinghe : శ్రీలంకలో మళ్లీ సంక్షోభం మిన్నంటింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది.
దేశాన్ని సర్వ నాశనం చేసిన గోటబయ రాజపక్సే ను దేశం విడిచి పోయేంత దాకా పోరాడిన లంకేయులు ఇప్పుడు మళ్లీ తమ పోరాటాన్ని ముమ్మరం చేశారు.
గోటబయ వెళ్లి పోయినా రణిలె విక్రమసింఘే (Ranil Wickremesinghe) ప్రధాన మంత్రి పదవి నుంచి ప్రెసిడెంట్ గా కొలువు తీరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన గెలుపొందారు.
కానీ ఆందోళనకారులు మాత్రం రణిలె తమకు వద్దంటున్నారు . నిరసనలు మరింత ఉధృతం చేశారు. గోటబయ, రణిలె విక్రమసింఘే ఇద్దరూ ఒక్కటేనని వారు ఆరోపిస్తున్నారు.
తాము ఖాకీలకు, తూటాలకు భయపడే ప్రసక్తి లేదంటున్నారు. ఇప్పటికే ఆర్థికంగా శ్రీలంక (SriLanka) చితికి పోయింది. బయటి దేశాల నుంచి అప్పులు పుట్టడం లేదు.
ఆహారం కోసం జనం అల్లాడుతున్నారు. కానీ మరో వైపు ప్రత్యక్షంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడాన్ని చూసిన విక్రమసింఘే మాత్రం తన తీరు మార్చు కోవడం లేదు.
విపక్షాలు సైతం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి దేశాన్ని భ్రష్టు పట్టించిన నాయకులలో గోటబయ, మహీంద, రణిలె విక్రమసింఘే ఉన్నారంటూ మండిపడుతున్నారు ఆందోళనకారులు.
తూటాలు ఎక్కు పెట్టినా తగ్గేదే లేదంటున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా బలగాలతో రాజ్యాన్ని పాలించాలని అనుకోవడం భ్రమ మాత్రమేనని పేర్కొన్నారు.
మరో వైపు గోటబయ మాల్దీవుల నుంచి సింగపూర్ కు చెక్కేశాడు. ఇక సోదరుడు మహీంద రాజపక్సే ఆర్మీ క్యాంపులో తలదాచుకున్నాడు.
Also Read : ఈ దేశంలో చంపినా చర్చే లేదు – టికాయత్