Parveta Utsavam : వైభవోత్సవం పార్వేట ఉత్సవం
ఘనంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడి ఉత్సవం
Parveta Utsavam : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీ శ్రీనివాసుడి పార్వేట ఉత్సవం(Parveta Utsavam) శ్రీవారి మెట్టు సమీపంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఇదే జూన్ మాసంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఈసారి భారీ ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు పుణ్య క్షేత్రానికి.
దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఉత్సవాలలో భాగంగా ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి ఉత్సవ మూర్తుల ఊరేగింపు శ్రీవారి మెట్టు సమీపం లోని పార్వేట మండపానికి చేరుకుంది. అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవాన్ని ఘనంగా చేపట్టారు. ఇందులో దుష్ట శిక్షణ కోసం స్వామి వారు మూడ సార్లు బళ్లెంను ప్రయోగించారు. ఆస్థానం అనంతరం సాయంత్రానికి స్వామి వారి ఉత్సవ మూర్తులను తిరిగి ఆలయానికి తీసుకు వచ్చారు.
ఈ సందర్బంగా టీటీడీ అన్నమాచర్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలాపించారు. భజన బృందాలు భజనలు, కోలాటాల ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు.
Also Read : TTD EO : డిసెంబర్ లో పద్మావతి ఆస్పత్రి ప్రారంభం
