Srisailam Darshanam : శ్రీశైల దేవస్థానం కీలక నిర్ణయం
ఆన్ లైన్ లోనే ఆర్జిత సేవా టికెట్లు
Srisailam Darshanam : శ్రీశైలం దేవస్థానం ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఆలయానికి సంబంధించి ఆర్జిత సేవా టికెట్లు జారీ చేయనుంది. ఈ విషయాన్ని శ్రీశైల ఆలయ ఈవో లవన్న వెల్లడించారు. సర్వ దర్శనం టికెట్లు కాకుండా మిగతా టికెట్లను ఆన్ లైన్ లోనే ఇక నుంచి జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కరెంట్ బుకింగ్ కౌంటర్ల ద్వారా జారీ చేసే విధానం ఉండదన్నారు.
ఏప్రిల్ 25 నుంచి శ్రీశైల దేవస్థానం(Srisailam Darshanam) అధికారిక వెబ్ సైట్ లో టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఇక నుంచి మే 1 నుంచి ఆన్ లైన్ లో మాత్రమే ఇస్తామన్నారు లవన్న. ఇటీవలి కాలంలో ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండడంతో భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు లవన్న వెల్లడించారు. ఆర్జిత సేవా టికెట్లు, స్పర్శ దర్శనం టికెట్ల జారీ విషయంలో కీలక మార్పులు చేశామని తెలిపారు.
ఆన్ లైన్ ద్వారా ఆర్జిత, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన భక్తులు టికెట్ పై సూచించిన సమయానికి ఆలయం వద్దకు చేరుకోవాలని సూచించారు ఈవో లవన్న. ఆన్ లైన్ లో టికెట్లు పొందిన భక్తులు విధిగా ఆధార్ కార్డులు సమర్పించాలని స్పష్టం చేశారు.
Also Read : సమున్నత భారతావనికి దిక్సూచి