SS Rajamouli Trip : త‌మిళ‌నాడులో ఆల‌యాలు అద్భుతం

కితాబు ఇచ్చిన ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి

SS Rajamouli Trip : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్రిన్స్ మ‌హేష్ బాబుతో అడ్వెంచ‌ర‌స్ క‌థానేప‌థ్యంతో ఓ సినిమా ప్లాన్ చేశారు. అంత‌కు ముందు ఫారిన్ టూర్ లో బిజీగా గడిపారు. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులోని ఆల‌యాల‌ను సంద‌ర్శించ‌డం ప‌నిగా పెట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయా ఆల‌యాలు క‌ట్టిన తీరును, శిల్ప నిర్మాణాన్ని చూసి ఆనందం క‌లిగింద‌ని పేర్కొన్నారు. ఆ సంతోషం వ‌ర్ణించ లేనిదంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా మంగ‌ళ‌వారం స్ప‌ష్టం చేశారు.

రాజ‌మౌళి అంటేనే క్రియేటివిటీకి పెట్టింది పేరు. ఆయ‌న విజువ‌ల్స్ అంత‌ర్జాతీయ స్థాయిని పోలి ఉంటాయి. ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఇంట‌ర్నేష‌న‌ల్ గా భారీ ప్ర‌జాద‌ర‌ణ పొందారు. ఆయ‌న ఇప్పుడు ఏం చేస్తున్నార‌నే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెల‌కొంది. త‌న కూతురుకు దేవాల‌యాల‌ను సంద‌ర్శించాల‌నే కోరిక‌ను వ్య‌క్తం చేసింద‌ని తెలిపారు ఎస్ఎస్ రాజ‌మౌళి(SS Rajamouli). ఈ సంద‌ర్భ‌గా త‌న కూతురుకు తాను ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు ద‌ర్శ‌కుడు పేర్కొన్నారు. ఎందుకంటే ఆమె కోరినందుకే తాను ఇక్క‌డికి రాగ‌లిగాన‌ని దీంతో అద్భుత‌మైన శిల్పా క‌ళా నైపుణ్యాన్ని చూసే భాగ్యం లేకుండా పోయి ఉండేద‌న్నారు ఎస్ఎస్ రాజ‌మౌళి.

జూన్ చివ‌రి వారంలో శ్రీ‌రంగం, దారాసురం, బృహ‌దీశ్వ‌ర్ కోయిల్ , రామేశ్వ‌రం, క‌ణాదుకథాన్ , తూత్తుకుడి, మ‌ధురైకి వెళ్లాన‌ని తెలిపారు. అద్భుత‌మైన వాస్తు శిల్పం , పాండ్యాలు, చోజాస్ నాయ‌క‌ర్లు, అనేక ఇత‌ర పాల‌కుల కాలంలో వీటిని అద్భుతంగా క‌ట్టించారంటూ కొనియాడారు ద‌ర్శ‌క ధీరుడు.

Also Read : DK Shiva Kumar : విప‌క్షాల భేటీకి సోనియా హాజ‌రు – డీకే

 

Leave A Reply

Your Email Id will not be published!