Statue Of Equality : హైదరాబాద్ లోని ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన సమతామూర్తి(Statue Of Equality) సహస్రాబ్ది మహోత్సవాలు ముగిశాయి . ఈనెల 2న ప్రారంభమైన ఉత్సవాలు 14తో ముగిశాయి. 13 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి.
నభూతో నభవిష్యత్ అన్న రీతిలో కొనసాగాయి. రూ. 1000 కోట్ల తో 216 అడుగుల శ్రీ రామానుజాచార్యుల సమతామూర్తి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఈనెల 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశానికి అంకితం చేశారు. అనంతరం 13న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వర్ణమూర్తి విగ్రహాన్ని (Statue Of Equality)ఆవిష్కరించారు.
ఇందులో భాగంగా ఆఖరు రోజున చిన్న జీయర్ స్వామి సమతామూర్తి విగ్రహానికి అభిషేకం చేశారు. భారీ ఎత్తున భక్తులు, పండితులు, రిత్వుకులు హాజరయ్యారు. సమతాకేంద్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 108 దివ్య దేశాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వేడుకలు ముగిశాయి. సువర్ణమూర్తికి ప్రాణ ప్రతిష్ట, కుంభాభిషేకం చేశారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి. మహా పూర్ణాహుతితో శ్రీ లక్ష్మీ నారాయణ క్రతువు ముగిసింది.
ఇదిలా ఉండగా మహోత్సవాలలో భాగంగా నిర్వహించాల్సిన శాంతి కళ్యాణాన్ని ఈనెల 19కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు ప్రవచన మండపంలో అష్టాక్షరీ మంత్ర పఠనం , విష్ణు సహస్ర పారాయణం చేపట్టారు.
114 యాగశాలల్లో 1035 హోమ కుండలాల్లో 2 లక్షల కేజీల ఆవు నెయ్యితో విష్వక్సేనేష్టి, నారసింహ ఇష్టి, లక్ష్మీ నారాయణ ఇష్టి, పరమేష్టి, వైభమేష్టి, హయగ్రీవ ఇష్టి, వైవాహిక ఇష్టి, సుదర్శన ఇష్టి, వైనతే ఇష్టి యాగ పూజలను నిర్వహించారు.
Also Read : ఆధ్యాత్మిక వైభవం ఆనంద సాగరం