Statue Of Equality : దారులన్నీ ముచ్చింతల్ లో కొలువై ఉన్న శ్రీరామనగరం ఆశ్రమం వైపు పరుగులు తీస్తున్నాయి. తండోప తండాలుగా తరలి వస్తున్న భక్తులతో కిట కిట లాడుతోంది. భక్తి వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.
దేశంలోనే అతి పెద్ద విగ్రహానికి శ్రీకారం చుట్టిన జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణంలో సమతా కేంద్రం (Statue Of Equality )సర్వాంగ సుందరంగా మారింది. ఎటు చూసినా జై శ్రీమన్నారాయణ నినాదమే.
ఎక్కడ చూసినా భక్త జన సందోహమే. భక్తి అన్నది ఒక సాధన అని, దానిని చేరుకోవాలంటే సత్య నిష్టత అన్నది ప్రధానమని బోధిస్తూ వస్తున్నారు. ఏది చెబుతామో అదే ఆచరణలో ఉండాలన్నది ప్రధాన సంకల్పం కావాలంటారు శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి.
జీవితానికి పరమార్థం ఏమిటి అన్నది తెలుసు కోవాలంటే భక్తి నీలో ఉండాలి. మనలో కలగాలి. ఏది మంచి ఏది చెడు ఏది ధర్మం ఏది అధర్మం ఏది సత్యం అన్నది ఎరుక కావాలంటే మహనీయుల జీవితాలను తెలుసు కోవాలి.
వారు అనుసరించిన మార్గాలను , వారు నడిచిన అడుగులేవో గుర్తించ గలగాలి అంటారు చిన్న జీయర్ స్వామి. సమస్త మానవాళి అంతా ఒక్కటే. సమస్త జీవ కోటి సమానమే.
ఈ అద్భుతమైన సమతా, మానవతా భావనను వెయ్యేళ్ల కిందట శ్రీరామానుజాచార్యులు రేకెత్తించారు. ప్రశ్నించారు. నిలదీశారు. ఎదుర్కొన్నారు.
కుల, మతాల పేరుతో మనుషుల్ని దూరం పెట్టడం, దైవానికి దూరం చేయడం తగదన్నాడు. అందుకే ఆ మహనీయుడి మార్గం నిత్యం స్పూర్తి దాయకంగా ఉండేందుకే సమతామూర్తిని ఏర్పాటు చేశామన్నారు.
Also Read : భక్తకి మార్గం సమతా కేంద్రం