Statue Of Equality : ఆధ్యాత్మిక సిగ‌లో స‌మ‌తా మూర్తి

జాతికి అంకితం ఇవ్వ‌నున్న మోదీ

Statue Of Equality : ప్ర‌స్తుతం దారుల‌న్నీ శ్రీ‌రామ‌న‌గ‌రం వైపు ప‌రుగులు తీస్తున్నాయి. వేలాది మంది భ‌క్తులు అటు వైపే చూస్తున్నారు. జై శ్రీ‌మ‌న్నారాయ‌ణ మూల మంత్రం న‌లు దిక్కులా వినిపిస్తున్నాయి.

వేదాలు, ఉప‌ష‌నిత్తుల సారాన్ని వెయ్యేళ్ల కింద‌టే అవ‌పోస‌న ప‌ట్టిన మ‌హ‌నీయుడు శ్రీ‌మ‌ద్ రామానుజులు(Statue Of Equality). కుల‌, మ‌తాలు పోవాల‌ని, వర్గాలు, విభేదాలు ఉండ‌రాద‌ని, స‌ర్వ మాన‌వాళి అంతా ఒక్క‌టేన‌ని చాటిన రామానుజుడు భార‌త దేశ ఆధ్యాత్మిక చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచి పోయాడు.

ఆయ‌న పుట్టింది వెయ్యేళ్ల కింద‌ట‌. అన్ని ఏళ్ల‌యినా ఇంకా రామానుజుడు ప్ర‌భ‌విస్తూనే ఉన్నాడు. ప్ర‌భావితం క‌లిగిస్తూనే ఉన్నాడు. అందుకే శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి ప‌దేళ్ల క‌ల ఇవాళ సాక్షాత్కారం కాబోతోంది.

దేశ ప్ర‌ధాని దీనిని ఆవిష్క‌రించి జాతికి అంకితం ఇవ్వ‌బోతున్నారు. కొత్త చ‌రిత్ర‌కు నాంది ప‌ల‌క‌బోతున్నారు. ఎక్క‌డి శ్రీ‌రంగా ఎక్క‌డి శ్రీ‌రామ‌న‌గ‌రం.

ప్ర‌స్తుతం స‌ప్త వ‌ర్ణ శోభితంతో ఆధ్యాత్మిక ఆల‌వాలంతో, శ్రీ‌మ‌న్నారాయ‌ణుడి వేద మంత్రంతో స‌మ‌తా ప్రాంగణం కొలువై ఉంది. 216 అడుగుల భారీ విగ్ర‌హాన్ని ఇక్క‌డ ఏర్పాటు చేశారు.

భారీ ఎత్తున ఖ‌ర్చు చేశారు. శ్రీ‌వైష్ణ‌వ సంప్రదాయాన్ని ప్ర‌తిబింబించేలా (Statue Of Equality)దీనిని రూపొందించారు. 54 అంగుళాల‌తో సువ‌ర్ణ మూర్తిని ఏర్పాటు చేశారు. 120 కేజీల బంగారాన్ని ఉప‌యోగించారు.

విశిష్టాద్వైత మ‌తాన్ని వ్యాప్తి లోకి తీసుకు వ‌చ్చారు రామానుజులు. ఈనెల 15 దాకా ఈ మ‌హోత్స‌వాలు కొన‌సాగుతాయి. దివ్య క్షేత్రంలో యాగాలు, హోమాలు జ‌రుగుతున్నాయి.

వేలాది మంది రుత్వికులు, పండితులు పాల్గొంటున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధానికి ఆశీస్సులు అంద‌జేస్తారు.

Also Read : స‌మ‌తా కేంద్రం ప్ర‌శాంతి నిల‌యం

Leave A Reply

Your Email Id will not be published!