Anu Agarwal : ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ‘ఆషికీ’ ఎవ‌ర్ గ్రీన్

అనూ అగ‌ర్వాల్ కు 52 ఏళ్లు

Anu Agarwal : భార‌తీయ సినీ జ‌గ‌త్తులో ఓ సినిమా హ‌ల్ చ‌ల్ చేసింది. కోట్లాది మందిని మైమ‌రిచి పోయేలా ఆక‌ట్టుకుంది. అంతేనా ఆ మూవీకి సంబంధించిన పాట‌లు యువ‌తీ యువ‌కుల‌ను ప్ర‌ధానంగా ప్రేమికుల‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ త‌లుచుకునేలా చేసింది.

మ‌రి అంత‌లా ఆద్యంత‌మూ ప్ర‌భావితం చేసిన ఆ సినిమాయే ఆషికీ. ఆ మూవీతో తెరంగేట్రం చేసిన న‌టి అనూ అగ‌ర్వాల్ . ఆమెకు ఇప్పుడు 52 ఏళ్లు. ఇవాళ అను అగ‌ర్వాల్ (Anu Agarwal)పుట్టిన రోజు.

1969 జ‌న‌వ‌రి 11న పుట్టింది. దొంగ దొంగ సినిమాలో చంద్ర‌లేఖ‌గా తెలుగు వారికి కూడా సుప‌రిచితురాలే. అనూ అగ‌ర్వాల్(Anu Agarwal) జ‌న్మ స్థ‌లం ఢిల్లీ. అయితే ఎక్కువ‌గా చెన్నైలో పెరిగింది.

ఢిల్లీ యూనివ‌ర్శిటీ నుంచి సోషియాల‌జీలో గోల్డ్ మెడ‌లిస్ట్ అందుకుంది. కొన్ని రోజుల పాటు మోడ‌లింగ్ చేసింది. టీవీలో యాంక‌ర్ గా ప‌ని చేసింది. ఆపై న‌ట‌న‌పై ఉన్న ఆస‌క్తితో తొలిసారిగా బాలీవుడ్ మూవీ ఆషికీలో న‌టిగా న‌టించి మెప్పించింది.

1999లో జ‌రిగిన ఓ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డింది. అనూ అగ‌ర్వాల్ 29 రోజుల పాటు కోమాలోనే ఉంది. ఆ త‌ర్వాత బ‌తికి బ‌య‌ట ప‌డింది. ప్ర‌స్తుతం ఆమె బీహార్ లో ఉంటోంది.

యోగా, ల‌లిత క‌ళ‌ల‌ను ప్రాక్టీస్ చేస్తోంది. ఇక సినిమా ప‌రంగా చూస్తే అనూ అగ‌ర్వాల్ కొన్ని సినిమాల‌లో న‌టించింది. రిట‌ర్న్ ఆఫ్ ది జువెల్ థీస్ , క‌న్యాదాన్ , జ‌నం కుండ‌లి, ది క్లౌడ్ డోర్ , బీపీఎల్ ఓయ్ , ఖ‌ల్ నాయికా , కింగ్ అంకుల్ , తిరుడా తిరుడా , గ‌జ‌బ్ త‌మాషా, ఆషికీ సినిమాల్లో న‌టించి మెప్పించింది.

Also Read : స‌మంత త‌మిళ మూవీపై ఉత్కంఠ‌

Leave A Reply

Your Email Id will not be published!