S Jai Shankar : న్యూజిలాండ్ తో బంధం బ‌లోపేతం – జై శంక‌ర్

కీవీస్ టూర్ లో విదేశాంగ శాఖ మంత్రి బిజీ

S Jai Shankar :  న్యూజిలాండ్ , భార‌త దేశాల మ‌ధ్య సంబంధాలు మ‌రింత బ‌లోపేతం చేసుకోవ‌డంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్(S Jai Shankar). త‌న కెరీర్ లో మొద‌టిసారి న్యూజిలాండ్ లో ప‌ర్య‌టించారు. కీల‌క‌మైన అంశాల గురించి చ‌ర్చించారు.

అంతే కాకుండా ఆ దేశ ప్ర‌ధాన‌మంత్రితో భేటీ అయ్యారు. ప్ర‌ధాన మంత్రి మోదీకి సంబంధించిన రెండు పుస్త‌కాల‌ను ఆవిష్క‌రించారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌వాస భార‌తీయులు ఏకంగా రెండున్న‌ర ల‌క్ష‌ల మంది న్యూజిలాండ్ లో నివ‌సిస్తున్నారు. గ‌త కొన్నేళ్లుగా భార‌త్, న్యూజిలాండ్ దేశాల మ‌ధ్య బంధం కొన‌సాగుతూనే వ‌స్తోంది.

వ్యాపార‌, వాణిజ్య , త‌దిత‌ర రంగాల‌లో కీల‌క‌మైన ఒప్పందాలు చేసుకున్నారు. జై శంక‌ర్ టూర్ లో భాగంగా ఆ దేశ ప్ర‌ధాని భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని త‌మ దేశంలో ప‌ర్య‌టించాల్సిందిగా కోరారు. ఈ మేర‌కు ఆహ్వానాన్ని అంద‌జేశారు జై శంక‌ర్ కు. ఆదివారం వెల్లింగ్ట‌న్ లో కొత్త‌గా ఏర్పాటు చేసిన భార‌త హైక‌మిష‌న్ ను ఆయ‌న ప్రారంభించారు.

దీని వ‌ల్ల మ‌రింత ఇరు దేశాలు ద‌గ్గ‌ర‌య్యేందుకు ఇది ఒక మార్గంగా దోహ‌ద ప‌డుతుంద‌న్నారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి. ఈ సంద‌ర్భంగా భార‌తీయ క‌మ్యూనిటీ స‌భ్యుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు జై శంక‌ర్(S Jai Shankar). వ్యాపారం, డిజ‌ట‌ల్ , వ్య‌వ‌సాయ రంగాల వంటి వివిధ రంగాల‌లో స‌హ‌కారాన్ని పెంపొందించే అవ‌కాశాల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

ప్రపంచాన్ని ప్ర‌స్తుతం ఉగ్ర‌వాదం పెను ముప్పుగా మారింద‌ని భార‌త్, న్యూజిలాండ్ దేశాలు పూర్తిగా శాంతిని కోరుతున్నాయ‌ని తెలిపారు.

Also Read : మ‌హ‌నీయుడికి మ‌ర‌ణం లేదు – మాయావ‌తి

Leave A Reply

Your Email Id will not be published!