Satyendra Jain ED : మంత్రి జైన్ కేసులో బలమైన ఆధారాలు
బిగుస్తున్న ఉచ్చుతో ఆప్ ఉక్కిరి బిక్కిరి
Satyendra Jain ED : ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్(Satyendra Jain) చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఇప్పటికే ఆయనకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలను సిద్దం చేసింది. ఈ మేరకు కోర్టులో సమర్పించింది.
దేశ వ్యాప్తంగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసేందుకు హవాలా నిధులను వినియోగించారని ఆరోపిస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషిట్ దాఖలు చేసింది.
ఈ మేరకు మంత్రి సత్యేంద్ర జైన్ పై ప్రాథమికంగా తగిన ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ కోర్టు తెలిపింది. జూలై 27న ఢిల్లీలోని ప్రత్యేక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎమ్ఎల్ఏ) కోర్టు ముందు ఛార్జిషీట్ లేదా ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేశారు.
కోర్టు దాని విచారణను తీసుకుందని ఈడీ తెలిపింది. మంత్రి సత్యేంద్ర జైన్ , ఆయన భార్య పూనమ్ జైన్ , సహచరులు అజిత్ ప్రసాద్ జైన్ , సునీల్ కుమార్ జైన్ , వైభవ్ జైన్ , అంకుష్ జైన్ తో పాటు ఆయా కంపెనీలను కూడా ఛార్జిషీట్ లోచేర్చింది ఈడీ.
కంపెనీల పరంగా చూస్తే అకించన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ , పర్యాస్ ఇన్ఫోసొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ , మంగ్లయాతన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ , జేజే ఐడియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను కూడా చేర్చింది.
ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి కీలక పాత్ర వహించారంటూ పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో పోర్ట్ ఫోలియో లేని మంత్రిగా ఉన్న 57 ఏళ్ల జైన్ ను గత మే 30న ఈడీ అరెస్ట్ చేసింది.
Also Read : కార్వే గ్రూప్ కేసులో రూ. 100 కోట్ల ఆస్తులు అటాచ్