Basara Students Protest : బాస‌ర‌లో మ‌ళ్లీ విద్యార్థుల ఆందోళ‌న

మాటిచ్చిన మంత్రి ప‌ల‌క‌ని వైనం

Basara Students Protest : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన తెలంగాణ‌లోని బాస‌ర ఐఐఐటి విద్యార్థుల ఆందోళ‌న(Basara Students Protest) మళ్లీ మొద‌లైంది. కొన్ని రోజుల త‌ర‌బ‌డి వ‌ర్షంలో నానుతూ నిర‌స‌న తెల‌ప‌డంతో చ‌ర్చ‌కు దారి తీయ‌డంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో విద్యా శాఖ మంత్రి స‌బితా రెడ్డి హామీ ఇచ్చారు.

దీంతో తాము విర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కానీ మెస్ లో చోటు చేసుకున్న వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. ఇప్ప‌టికే ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోవ‌డం తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది.

దీంతో ఆర్జేయూకేటీలో మ‌ళ్లీ ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. మ‌రోసారి విద్యార్థులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. విష ఆహారం ( ఫుడ్ పాయిజ‌న్ ) కు కార‌ణ‌మైన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

భోజ‌న‌శాల‌కు లైసెన్స్ ను వెంట‌నే ర‌ద్దు చేసి కొత్త వారిని నియ‌మించాలంటూ జూలై 30 రాత్రి నుంచి నిర‌వ‌ధిక నిరాహార దీక్ష‌కు కూర్చున్నారు.

త‌మ డిమాండ్ల‌ను నెర‌వేరుస్తామంటూ ఇచ్చిన ప్ర‌భుత్వం హామీల‌ను తుంగ‌లో తొక్కిందంటూ ఆరోపించారు బాధిత విద్యార్థులు. రాత్రి భోజ‌న చేసేందుకు వెళ్లిన విద్యార్థులంతా అన్నం తిన‌కుండా నిర‌స‌న చేప‌ట్టారు.

త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు భోజ‌నం చేయ‌బోమంటూ స్ప‌ష్టం చేశారు. రాత్రంతా మెస్ లోనే జాగారం (మేల్కొని) చేశారు. త‌మ ఆందోళ‌న‌ను మ‌రింత ఉధృతం చేస్తామంటూ హెచ్చ‌రించారు.

ఇప్ప‌టికే విప‌క్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి బాస‌ర ఐఐటీలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై. వెంట‌నే స‌ర్కార్ స్పందించాల‌ని పిల్ల‌ల‌కు న్యాయం చేయాల‌ని కోరుతున్నాయి.

ఇంత జ‌రుగుతున్నా టీఆర్ఎస్ స‌ర్కార్ మాత్రం గోస ప‌ట్టించు కోలేదు.

Also Read : స‌మున్న‌త భార‌తం త్రివ‌ర్ణ ప‌తాకం

Leave A Reply

Your Email Id will not be published!