Subramanian Swamy : భారత ఆర్థిక వ్యవస్థపై ‘స్వామి’ ఆందోళన
ఇలాగే అయితే దేశ పరిస్థితి గందరగోళం
Subramanian Swamy : భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ప్రస్తుతం ముగ్గురు నాయకులు వ్యతిరేక ముద్ర పడ్డారు.
వారిలో సుబ్రహ్మణ్యస్వామి, ఎంపీ వరుణ్ గాంధీ, మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. ఈ ముగ్గురు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డాలను ఏకి పారేస్తున్నారు. తాజాగా సుబ్రహ్మణ్యస్వామి(Subramanian Swamy) మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు దిగజారి పోతోందని , దానిని గాడిన పెట్టాలంటే మరింత చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సుబ్రహ్మణ్యస్వామి మొదటి నుంచీ మోదీ పాలనపై గుర్రుగా ఉన్నారు.
ఎప్పటికప్పుడు లోపాలను ఎత్తి చూపుతూ వస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వ ధోరణి పనికి రాదంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. 2016 నుంచి దేశ ఆర్థిక రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు.
రోజు రోజుకు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు సుబ్రహ్మణ్యస్వామి. దేశ ఆర్థక రంగం గురించి మోదీ తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని, ఇక ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఈ విషయంలో వెరీ పూర్ అని కొట్టి పారేశారు.
దేశానికి అద్భుతమైన నాయకత్వం అవసరమని, మనం ప్రయత్నం చేస్తే చైనాను అధిగమించ వచ్చని అభిప్రాయపడ్డారు మాజీ ఎంపీ. రాబోయే 25 ఏళ్లలో అమెరికాను సైతం ఢీకొట్టగలమన్నారు.
దిగజారిన ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. వడ్డీ రేట్లు, ఆదాయపు పన్నులు తగ్గిస్తే బెటర్. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు సుబ్రహ్మణ్యస్వామి.
కేంద్ర సర్కార్ చర్యలన్నీ భిన్నంగా ఉన్నాయి. అమెరికాలో 2 శాతంగా ఉంటే భారత్ లో 12 నుంచి 14 శాతంగా ఉన్నాయన్నారు. ఎఫ్డీ రేట్లను 9 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. దీని వల్ల పేదలు, సామాన్యులు వాటికి దూరమయ్యారని అన్నారు.
Also Read : ఆకలి భారతమా అవినీతి దేశమా