#AmandeepKaur : అమెరికా చదువు వద్దని అరక పట్టిన యువతి అందరికీ స్ఫూర్తి
Amandeep Kaur: విదేశాలలో సీటొస్తే చాలు పరుగులు తీసే యువత ఉన్న ఈ రోజులలో పంజాబ్ కు చెందిన ఓ అమ్మాయి పై దేశాలలో చదువులుకన్నా మన దేశంలో వ్యవసాయమే ముద్దని తేల్చి చెప్పి, తండ్రికి తోడుగా వ్యవసాయం చేస్తోంది.
Amandeep Kaur: విదేశాలలో సీటొస్తే చాలు పరుగులు తీసే యువత ఉన్న ఈ రోజులలో పంజాబ్ కు చెందిన ఓ అమ్మాయి పై దేశాలలో చదువులుకన్నా మన దేశంలో వ్యవసాయమే ముద్దని తేల్చి చెప్పి, తండ్రికి తోడుగా వ్యవసాయం చేస్తోంది. పంజాబ్ కనోయి గ్రామానికి చెందిన అమన్‌దీప్ కౌర్ (21) అందరిలాగే విదేశాలకు వెళ్లాలని, అక్కడే చదువుకుని మంచి ఉద్యోగం కూడా చూసుకోవాలని అనుకుంది. అందుకు తగ్గట్టే 2018 లో IELTS ని క్లియర్ చేసింది. అమెరికాలోని కెనడియన్ కళాశాల నుండి ఆఫర్ లెటర్ కూడా అందుకుంది. అయినా దానికంటే నాన్న చేస్తున్న వ్యవసాయమే తనను ఆకర్షించిందంటూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆదర్శ రైతుగా మారింది అమన్‌దీప్ కౌర్(Amandeep Kaur).
ఇదేంటి నీ ఆశలు ఎందుకు చంపేసుకున్నావ్ అంటే … వ్యవసాయం చేస్తున్న నాన్నకు సహాయ పడదామని పొలంలోకి వెళ్ళిన నాకు నాన్న పడుతున్న కష్టం చూసారు. నేను విదేశాలకు వెళితే నాన్న ఒక్కడే వ్యవసాయం పనులు చూసుకోవాల్సి వస్తుందనిపించింది. తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడో చదివి, ఉద్యోగం సంపాదించినా, ఈ వయసులో వాళ్లని దగ్గరుండి చూసుకోవటమే నాకు ముఖ్యమనిపించింది. అందుకే గత మూడేళ్లుగా నా తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తున్నా అని చెప్పుకొచ్చింది.
బాలికలు అన్ని ప్రాంతాలలో అబ్బాయిలతో పోటీ పడగలిగినప్పుడు, వ్యవసాయంలో మాత్రం ఎందుకు రాణించరన్న ప్రశ్నే తనకు ప్రేరణ అని చెపుతున్న అమన్ . ఉదయం పొలానికి వెళ్లి వ్యవసాయం చేస్తునే ఫుడ్ ప్రాసెసింగ్‌లో డిప్లొమా కూడా చేసానని తద్వారా ఆధునిక వ్యవసాయం ద్వారా పంటలతో లాభాలందుకుంటున్నానని చెప్పింది.
వ్యవసాయంలో పాటియాలా ఖల్సా కాలేజ్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ చేసింది. ట్రాక్టర్‌ను ఎలా నడిపించాలో నేర్చుకుంది. రెండు సంవత్సరాల క్రితం హ్యాపీ సీడర్‌ను ఉపయోగించడం ప్రారంభించింది. పొలంలో చెరకు, గోధుమలను పండించి మిగిలిన వ్యర్ధాలను తండ్రి ఇతర రైతుల మాదిరిగానే తగలబెట్టేవాడు. ఆ పొగకి ఊపిరి ఆడక ఇబ్బంది పడిన రోజులనూ గుర్తు చేసుకుంటూ, తాను వ్యవసాయం చేయడం ప్రారంభించాక పంట వ్యర్థాలను అక్కడే నీటిలో నాననిచ్చి ఎరువుగా మార్చేసి తొలి ఏడాది ఎరువులు లేకుండానే పంట వేసి 50 శాతం అదనపు దిగుబడిని సాధించి జిల్లా కలెక్టర్ అభినందనలతో పాటు, చుట్టు పక్కల గ్రామ ప్రజల ప్రశంసలూ అందుకుంది అమన్.
ఇప్పుడు నా గ్రామంలోని ప్రజలు ఈ రంగంలో పనిచేయడానికి అనేక ఇతర కుటుంబాలు తమ అమ్మాయిలను ప్రోత్సహిస్తుండటం అనందంగా ఉందని అమన్ మామ జగదీప్ సింగ్ మీడియా ముందు ఆనందం వ్యక్తం చేసారు.
నిజమే వ్యవసాయం దండగ మారిగా మారుతున్న ఈ రోజులలో వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకుని లాభాల పంట పండిస్తున్న అమన్ ఎందరో యువతకు స్ఫూర్తి కలిగిస్తోందనటంలో సందేహం లేదు.
Also Read: ఇంజనీరింగ్ వేస్ట్ పకోడీ బిజినెస్ బెస్ట్

No comment allowed please